హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరు

మెగాస్టార్‌ చిరంజీవికి హనుమంతుడు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొణిదెల శివ శంకర వరప్రసాద్‌ గా ఉన్న అతడి పేరుని హనుమన్‌ విూద ఇష్టంతో చిరంజీవిగా మార్చుకున్నాడు. అయితే హనుమాన్‌ జయంతి ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజాగా మెగాస్టార్‌ కూడా హనుమ జన్మదినం పురస్కరించుకుని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు. అందరికీ హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు ఆ హనుమంతుడి అకుంఠిత దీక్ష , కార్యదక్షత,సూక్ష్మ బుద్ధి, ధైర్య సాహసాలు మనందరికీ ఎల్లపుడూ స్ఫూర్తి దాయకం అంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశాడు. దీనితో తాను నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర సెట్స్‌ నుంచి హనుమంతుడి ఫొటో పంచుకున్నాడు.