తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను ఇస్తామని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్నవాళ్లు సైతం ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఈ పథకం లబ్ధిదారులు మొదట గ్యాస్ సిలిండర్ కు సంబంధించిన పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ కు 40 రూపాయల సబ్సిడీ ఇస్తోంది. ఆ సబ్సిడీ మొత్తాన్ని తీసేసి మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. ఉజ్వల గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు ప్రస్తుతం 340 రూపాయల సబ్సిడీ లభిస్తోంది. గ్యాస్ సిలిండర్ మొత్తంలో 840 రూపాయలు తీసివేసి మిగిలిన మొత్తాన్ని ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.
తెలంగాణలో ప్రాంతాలను బట్టి గ్యాస్ సిలిండర్ రేటు విషయంలో స్వల్పంగా మార్పులు ఉంటాయి. 500 రూపాయల కంటే ఎంత అధికంగా గ్యాస్ సిలిండర్ ఉంటే అంత ఎక్కువ మొత్తాన్ని సబ్సిడీలు పోగా పొందవచ్చు. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ స్కీమ్ అమలు కానుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
సోమవారం రోజున ఈ స్కీమ్ యొక్క లబ్ధిదారుల వివరాలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అధికారులు ఇవ్వనున్నారు. ఆప్ ఫ్రంట్ అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించి అధికారులు ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నారు. లబ్ధిదారులకు ఇచ్చే సిలిండర్లను బట్టి రాయితీ మొత్తాన్ని జమ చేసేలా ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది.