అల్లు అర్జున్‌పై పొన్నప్ప ప్రశంసలు!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పై కన్నడ నటుడు తారక్‌ పొన్నప్ప ప్రశంసలు కురిపించారు. ‘కేజీఎఫ్‌’తో గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘పుష్ప2’లో కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. బన్నీతో కలిసి నటించిన అనుభవాన్ని ఈ సందర్భంగా షేర్‌ చేసుకున్నారు.

‘పుష్ప ది రూల్‌’లో నాకు అల్లు అర్జున్‌ తో యాక్షన్‌ సన్నివేశాలున్నాయి. గతంలో స్టంట్స్‌ చేసిన అనుభవం నాకు లేదు. ఫైట్‌ సీక్వెన్స్‌ చేసేటప్పుడు ఆయన ఎన్నో కొత్త విషయాలను చెప్పారు. స్క్రీన్ పై కనిపించే విధానంలో పలు సలహాలు ఇచ్చారు. బాడీ పొజిషన్స్‌ గురించి చెప్పారు. ఆయనకు డ్యాన్స్‌, స్టంట్స్‌పై ఉన్న అద్భుతమైన పరిజ్ఞానం చూసి ఆశ్చర్యపోయాను. ఆయన గొప్ప నటుడు‘ అని కితాబిచ్చారు.

’పుష్ప: ది రైజ్‌’కి పాన ఇండియా స్థాయి సూపర్‌హిట్‌ కావడంతో దానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ‘పుష్ప: ది రూల్‌’పై మరింత దృష్టి పెట్టారు సుకుమార్‌ టీమ్‌. మొదటి భాగాన్ని మించి ఈ చిత్రం ఉండాలని ఆహర్నిశలు కష్టపడుతున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, అనసూయ, సునీల్‌ కీలక పాత్రధారులు. ఆగస్ట్‌ 15న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.