Jobs: 10 తర్వాత జాబ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ అవకాశాలు మీకోసమే?

చాలామంది పదవ తరగతి పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలు చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ 10 తర్వాత ఎలాంటి జాబులు ఉంటాయి. ఎలా అప్లై చేసుకోవాలి? ఏంటి అన్న విషయాలు చాలా మందికి తెలియదు. అయితే మీరు కూడా 10 పాస్ అయి ఉంటే 10 తర్వాత జాబ్ చేయాలనుకుంటే ఈ ఇది మీకోసమే. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి తెలంగాణ నిర్దిష్ట డిప్లమా కోర్సులలో చేరాలనుకునే అభ్యర్థులకు ప్రతి సంవత్సరం లాగే టీఎస్ పాలిసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది.

తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని పిలవబడే వార్షిక రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్ష ఇంజనీరింగ్ కళాశాలల పాలిటెక్నిక్ లు అలాగే ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ లు సంస్థలలో ప్రవేశానికి అర్హత కలిగిన దరఖాస్తుదారులకు నిర్వహించబడుతుంది. ఇకపోతే అర్హత విషయానికి వస్తే.. తెలంగాణ లేదా ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బోర్డు నుంచి పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. అప్లికేషన్ చేయు విధానం…
PolyCET.sbtet.telangana.gov.in వెబ్సైట్ ద్వారా మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ ఐడి పాస్ వర్డ్ ఏర్పాటు చేసుకోవాలి. పూర్తి వివరాలు , విద్యార్హతలు, పరీక్షా కేంద్రాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఓబీసీ జనరల్ అభ్యర్థులు 500 రూపాయలు, SC/ST అభ్యర్థులు 250 రూపాయలు చెల్లించాలి. అయితే ఇందుకు 22ఏప్రిల్ 2024 న అప్లికేషన్ చివరి తేదీ.

100 రూపాయల ఆలస్య రుసుము చెల్లించి 24 ఏప్రిల్ 2024 వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. 300 రూపాయల ఆలస్య రుసుము చెల్లించి 26 ఏప్రిల్ వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. 24 మే 2024 న అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. అయితే పాలిటెక్నిక్ హాజరైన అభ్యర్థికి రెండు వేరు వేరు ర్యాంకులు కేటాయించబడతాయి. పాలిటెక్నిక్ లలో డిప్లొమాకోర్స్ లు మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లలో పొందిన మార్కుల ఆధారంగా అభ్యర్థికి ర్యాంక్ జారీ చేయబడుతుంది. బయాలజీ ప్రశ్నలను ఛాయిస్ కింద తీసుకోవచ్చు. ఇంజనీరింగ్ లేదా నాన్ ఇంజనీరింగ్ డిప్లమా కోర్సులు ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థికి అడ్మిషన్ కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారం కేటాయించబడలేదు. అర్హత పరీక్షలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫారం నింపి మాథ్స్, ఫిజిక్స్ ,కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులపై అవగాహన సాధించడం ముఖ్యమని సంబంధిత అధికారులు వెల్లడించారు.