‘యానిమల్’తో సూపర్ హిట్ అందుకున్న రణ్‌బీర్ కపూర్ తర్వాత సినిమా కోసం సిద్ధమవుతున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో భారీ వ్యయంతో రూపొందించనున్న ‘రామాయణ’లో ఆయన లుక్ కోసం జిమ్‌లో శ్రమిస్తున్నారు. ఎంతోమంది సెలబ్రిటీల వ్యక్తిగత ట్రైనర్ శివోహం.. ’యానిమల్’ నుంచి ‘రామాయణ’ వరకు రణ్‌బీర్ ఎంతో చమటోడ్చినట్లు రాసుకొచ్చారు.’మూడు సంవత్సరాల నుంచి రణ్‌బీర్ ఎంతో కష్టపడుతున్నారు. జీవితంలో షార్ట్‌కట్‌లు తీసుకోవడం వల్ల సాధించేదేవిూ లేదు. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన ప్రణాళిక అవసరం. ఆయన సంకల్పం చాలా గొప్పది. విూతో ఇన్నేళ్ల నా ప్రయాణం మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది. తదుపరి బ్లాక్‌బస్టర్‌కు ముందుగానే శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు.
‘యానిమల్’ లుక్‌ను కొత్త ఫొటోతో పోలుస్తూ ఒక ఇమేజ్‌ను షేర్ చేశారు. దీనికి ‘రామాయణ ది ఫిల్మ్’ అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవలే రణ్‌బీర్ విలువిద్య నేర్చుకుంటున్న ఫొటోలు కూడా సోషల్ విూడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిత్రం కోసం ఆయన కొన్ని రోజుల పాటు మాంసాహారం, మద్యపానం మానేశారు. భారీ తారాగణంతో నిర్మిస్తున్న ‘రామాయణ’ అప్‌డేట్స్ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలల పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకొన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ముంబయిలోని ఓ స్టూడియోలో చిత్రీకరణ మొదలైంది. ఇందులోని నటీనటులు లుక్‌లు లీక్ కాకుండా ఉండేందుకు సెట్స్‌లోకి సెల్‌ఫోన్‌లను నిషేధించారు.
దీనికి తెలుగు వెర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు అప్పగించినట్లు సమాచారం. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి , రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. మూడు భాగాలుగా దీన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. తొలి పార్ట్‌ను 2025 దీపావళికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.