‘ఆ ఒక్కటీ అడక్కు’ ట్రైలర్‌ విడుదల!

స్నేహితులైన టాలీవుడ్‌ హీరోలు అల్లరి నరేశ్‌,నాని ‘ఆ ఒక్కటీ అడక్కు’ ట్రైలర్‌ విడుదల వేడుకలో సందడి చేశారు. నరేశ్‌ హీరోగా నూతన దర్శకుడు మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమిది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌. మే 3న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నరేశ్‌ ఎక్కువగా తన చిత్రాల ఈవెంట్లకు నన్ను రమ్మని అడగడు. ఈ సినిమాకి పిలిచాడంటే అది తన మనసుకు ఎంత దగ్గరైందో అర్థమైంది. ఈ సినిమా టైటిల్‌తోనూ తనకు ఎమోషనల్‌ కనెక్షన్‌ ఉంది. నరేశ్‌ని కామెడీ నుంచి కాస్త బ్రేక్‌ తీసుకోమని ఒకానొక సమయంలో పట్టుబట్టా. తను ప్రతిభావంతుడు. అలాంటివాడు విభిన్న నేపథ్య కథల్లో నటిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే అలా చెప్పా.

కానీ, ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌ చూశాక ఇతడి కామెడీని నేను మిస్‌ అయ్యానా? అని అనిపించింది. ఇతర జానర్‌ చిత్రాల మధ్యలో హాస్య ప్రధాన సినిమాలు ప్లాన్‌ చేసుకో అని నాని నరేశ్‌కు సూచించారు. అభిమానులు ‘జెర్సీ’ సీక్వెల్‌ గురించి అడగ్గా.. ‘జెర్సీలో నా పాత్ర పూర్తయింది కదా. జెర్సీ 2 ఎవరితో చేస్తారో చేసుకోండి’ అంటూ నవ్వులు పూయించారు. నరేశ్‌ మాట్లాడుతూ.. అన్ని విభాగాల వారు కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. చాలాకాలం తర్వాత కామెడీ ఫిల్మ్‌తో విూ ముందుకొస్తున్నా. ఈ వేసవిలో మిమ్మల్ని తప్పకుండా నవ్విస్తా అని అన్నారు. ’సుడిగాడు’ సీక్వెల్‌ వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.