హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ దరఖాస్తులను ఏప్రిల్ నెల 13వ తేదీ చివరి తేదీగా ఉంది. https://www.ecil.co.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. నెలకు ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 40000 రూపాయల నుంచి 1,40,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు 1000 రూపాయలు దరఖాస్తు
ఫీజుగా ఉంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుందని భోగట్టా. ఏప్రిల్ 13 వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు చివరి తేదీగా ఉండటంతో అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.