హైదరాబాద్ నాటి ఆంధ్రులందరి సృష్టి

ఈ రోజు లోక్ సభలో మోదీ ప్రభుత్వం మీద మొదలయిన అవిశ్వాసం చర్చ  తెలుగుదేశంసభ్యుడు గల్లా జయదేవ్  వాడి వేడి ప్రసంగంతో మొదలయింది. ప్రధానిమీద దాడితో మొదలయింది. ఆంధ్రప్రదేశ్ ని  2014 లోఎలా విభజించారో ఆయన చెప్పారు. విభజన న్యాయ బద్ధంగా జరగలేదని, నాటి ఆంధ్రప్రదేశ్ కు ప్రధాన అర్థిక వనరుగా ఉన్న హైదరాబాద్ తెలంగాణ కు వెళ్లిపోవడం నవ్యాంధ్రకు హాని చేసిందని ఆయన చెప్పారు. ఇది సభలో గొడవకు కారణమయింది.

హైదరాబాద్ సంపద అప్పటి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల సృష్టించినది. హైదరాబాద్ నగరతం విభజనలో తెోలంగాణాకు వెళ్లి పోవడంతో ఆంద్రప్రదేశ్ బాగా నష్టపోయింది. ఇతర దక్షిణాది రాష్ట్రాలన్నింటికి రాజధానులున్నాయి. రాజధానులే  ఆర్థిక పెరుగుదల ఇంజన్ లగా పనిచేస్తుంది. ఇతర రాష్ట్రాల విషయంలో రుజువయింది.  జయదేవ్ హైదరాబాద్ ప్రస్తావన తీసుకురాగానే తెలంగాణ రాష్ట్ర సమతి సభ్యులు గొడవ చేయడం మొదలుపెట్టారు.