శని ప్రభావం మీపై పడుతుందని చెప్పే సంకేతాలివే..?

జ్యోతిష శాస్త్రం ప్రకారం శని దేవుడిని కర్మదాతగా భావిస్తారు. ఎవరి కర్మలకు తగ్గ వారికి ఫలితాలను అందిస్తూ ఉంటారు.ఇలా శని ప్రభావం ఒక్కసారి మనపై ఉంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. అయితే శని ప్రభావం మనపై పడుతుంది అని తెలియడానికి ముందుగా కొన్ని సంకేతాలు మనకు కనబడుతుంటాయి.మరి శని ప్రభావం మనపై పడుతుందనే సమయంలో ఎలాంటి సంకేతాలు ఉంటాయి వాటి నుంచి తప్పించుకోవడానికి ఏ విధమైనటువంటి పరిహారం పాటించాలి అనే విషయానికి వస్తే…

శని ప్రభావం మనపై ఉంటుందనే సమయంలో ఉన్నఫలంగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. కారణం లేకుండా మనం చేసే పనిలో సమస్యలు ఏర్పడడం మనం మొదలుపెట్టిన కార్యక్రమాలు ముందుకు సాగకపోవడం జరుగుతుంది. ఇక శని ప్రభావం మనపై పడుతుందనే సమయంలో ఒక వ్యక్తి మోసంలో చిక్కుకోవడం దానివల్ల పరువు ప్రతిష్టలు పోవడమే కాకుండా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

శని ప్రభావం మనపై అధికంగా ఉన్నప్పుడు కొందరు చెడు వ్యసనాలకు కూడా బానిస అవుతారు. ఇలాంటి పరిస్థితులలో ఎన్నో అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా వెంటాడుతాయి. ఇక శని ప్రభావం మనపై పడుతుందన్న సమయంలో ఆ వ్యక్తి నుదురు మొత్తం నలుపు రంగులో కనపడుతుంది. ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారు శని మహాదశ నుంచి తప్పించుకోవడం కోసం ఈ చిన్న పని చేస్తే చాలు. శని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి అమావాస్య రోజు పవిత్రమైన నదులు స్నానం చేసి పేదవారికి మన శక్తి సామర్థ్యాలను బట్టి దానధర్మాలు చేయాలి. అలాగే శనివారం అశ్వర్థ వృక్షానికి నీతిని నైవేద్యంగా సమర్పించడం వల్ల శని ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు.