Today Horoscope: జనవరి 28వ తేదీ శనివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: మీరు చేసే ఉద్యోగం లో కొన్ని మార్పులను ఎదుర్కొంటారు!

మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పులను ఎదుర్కొంటారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. తరచు నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి: ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి!

ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మిధునరాశి: కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు!

కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది. మీ చిన్ననాటి స్నేహితులను కలిసి చాలా సంతోషంగా గడుపుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

కర్కాటక రాశి: భూమికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు!

భూమికి సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. కుటుంబ సభ్యులతో కలసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. మీ తల్లిదండ్రులతో కలసి దేవదర్శనాల వంటి దూరపు ప్రయాణాలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో అంతా మంచే జరుగుతుంది.

సింహరాశి: నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది!

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడి కి గురై అవకాశం ఉంది. దూరప్రాయాణాలను వాయిదా వేయడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

కన్యరాశి: కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది!

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి అందుతుంది. ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దూర ప్రాంతాల బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొందరి కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

తులరాశి: తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి!

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికరాశి: మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది!

మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది. బాగా ప్రారంభించిన పనులను చాలా నిదానంగా పూర్తి చేస్తారు. తరచూ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మిత్రుల శత్రువులుగా మారే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

ధనుస్సురాశి: ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి!

ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది. కొన్నిదూర ప్రయాణాలను వాయిదా వేయాలి. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

మకరరాశి: సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి!

సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. మీ కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది. మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.

కుంభరాశి: ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు!

ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడమే మంచిది.

మీనరాశి: కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. స్థలం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు. సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది. కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ పాత మిత్రులను కలుసుకుంటారు