Rajeev Kanakala–Brahmaji: ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. వీటితో పాటు కొత్త కొత్త షోలు కూడా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ పదుల సంఖ్యలో ఎంటర్టైన్మెంట్ షోలు బుల్లితెరపై ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. వీటికి తోడు పండుగ ఈవెంట్ లను కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే త్వరలోనే న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీ వారు సుమ అడ్డా దావత్ అంటూ న్యూ ఇయర్ సందర్భంగా ఒక స్పెషల్ ప్రోగ్రాం చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ ఈవెంట్ లో సుమతో పాటు రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సమీర్, సుమ, సౌమ్య శారదా, రీతూ చౌదరి, అరియనా గ్లోరీ, హైపర్ ఆది, ఇమ్మాన్యుయేల్.. ఇలా చాలామంది టీవీ స్టార్లు వచ్చారు.
కామెడీతో పాటు పాటలు, డ్యాన్సులు, గేమ్స్ అన్ని ఈ ఈవెంట్లో జరిగినట్లు తెలుస్తోంది. షో మొత్తం సందడి సందడిగా సాగిపోయినప్పటికీ ప్రోమో చివర్లో మాత్రం రాజీవ్ కనకాల అలాగే బ్రహ్మాజీ స్టేజ్ మీద ఎమోషనల్ అయిపోయారు. రాజీవ్ కి వాళ్ళ తల్లితండ్రులు దేవదాస్ కనకాల, లక్ష్మి కనకాల విగ్రహం గిఫ్ట్ గా ఇచ్చారు. దివంగత నటీ నటులు దేవదాస్, లక్ష్మి నటీ నటులుగా కాకుండా నట గురువులుగా కుడా ఎంతో మందికి శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహం చూసి మొదట నటుడు బ్రహ్మాజీ ఎమోషనల్ అయ్యారు. బ్రహ్మాజీ మాస్టారు, మేడం అంటాము మేము వాళ్ళను. మేము ఇవ్వాళ ఇక్కడ ఉన్నాము అంటే దానికి కారణం వాళ్ళే అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇక తన తల్లితండ్రుల ఫొటోని, స్క్రీన్ పై వేసిన తన ఫ్యామిలీ ఫొటోని చూసి రాజీవ్ కనకాల ఒక్కసారిగా ఏడ్చేశారు. రాజీవ్ కనకాల ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం నేను వీళ్ళ కడుపున పుట్టడం, ఇప్పుడు వాళ్ళు ముగ్గురు లేరు. నా తోడ బుట్టింది లేదు, నన్ను కన్నవారు లేరు అంటూ ఏడ్చేశారు. దీంతో అక్కడున్న వారంతా కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ ప్రోమో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ జనవరి కి రానుంది.