బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కపుల్స్‌లో టాప్‌లో ఉంటారు అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్. సిల్వర్ స్క్రీన్‌పై పలు సినిమాల్లో మెరిసిన ఈ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని తెలిసిందే. వీరి కూతురు ఆరాధ్య. అయితే ఐష్-అభిషేక్ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఇటీవల జరిగిన అనంత్ అంబానీ వెడ్డింగ్ ఈవెంట్‌కు ఐశ్వర్యారాయ్ తన కూతురుతో కలిసి సింగిల్‌గా హాజరవడంతో.. ఐష్ అత్తవారింట్లో మనస్పర్థలు రావడం కారణంగా తన భర్త అభిషేక్ బచ్చన్ ఇంటి నుంచి బయటకు వచ్చి విడిగా ఉంటోందంటూ వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అభిషేక్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో తన వెడ్డింగ్ రింగ్‌ను చూపిస్తూ.. క్షమించండి.. నేనిప్పటికీ పెళ్లి చేసుకునే ఉన్నా.. అంటూ రిప్లై ఇచ్చి విడాకుల రూమర్లకు చెక్ పెట్టేశాడు.
అయితే ఆరాధ్య ముంబై ధీరూభాయ్ అంబానీ స్కూల్‌లో చదువుతుండగా.. తాజాగా ఈ స్కూల్ వార్షికోత్సవంలో బీటౌన్ సెలబ్రిటీలు సందడి చేశారు. ఈ గ్యాంగ్‌లో అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ కలిసి కనిపించారు. ఈ స్టార్ కపుల్ హాయిగా నవ్వుతూ కనిపించారు. అమితాబ్ బచ్చన్ కూడా ఈవెంట్‌లో సందడి చేశారు. మొత్తానికి ఐష్-అభిషేక్ కలిసి కనిపించి తమపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేశారు. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని వైవాహిక జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారని తాజా ఫొటోలు క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.