KTR: అమావాస్యకు బాంబులు కొంటే పౌర్ణమి వరకు పేలలేదు: కేటీఆర్

KTR: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పై కేటీఆర్ సెటైర్లు పేల్చారు. తుస్సు బాంబుల శాఖ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ దీపావళి అమావాస్యకు బాంబుల కొంటె కార్తీక పౌర్ణమి వరకు పేలలేదు అంటూ ఈయన ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో పలువురు రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన నేపథ్యంలో ఈయన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రిపై ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఈ సమావేశంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ పొంగులేటి ఇంటిపై ఈడి అధికారులు సోదాలు జరిపి 45 రోజులు అవుతున్న ఇప్పటివరకు ఈ విషయంపై ఒక చిన్నమాట కూడా మాట్లాడలేదని తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు బిజెపి నేతలు ఈడీ అధికారులందరూ కూడా మౌనం పాటిస్తున్నారని ఈయన తెలిపారు. ఈ ఒక్క విషయం చాలు ఎవరు ఎవరితో ఉన్నారో తెలియడానికి.

కాంగ్రెస్ బీజేపీ మధ్య రహస్య అవగాహనకు ఇది నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. అదే ఈడీ కవిత ఇంటిపైన, మరోక ప్రతిపక్ష నేతపైన దాడులు చేస్తే గుండు పిన్ను దొరికిన దానిని బయటపెట్టే అధికారులు పొంగులేటి విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిజెపి వారు సంతలో మేకలను కొంటున్నట్లు కొంటున్నారని ఖర్గే మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో మాట్లాడారు.

ఇక తెలంగాణలోని మేకల మండిలో కాంగ్రెస్ బాగా కొనుగోలు చేస్తుందని, మా మేకలు తప్పిపోయి కాంగ్రెస్ మందలో తిరుగుతున్నాయని మా మేకలు పట్టుకొచ్చుకుంటామని మీరు ఇక్కడిక రండని పిలిచాను అంటూ ఫైర్ అయ్యారు. ప్రకాష్ గౌడ్, గాంధీ లకు ఏమైనా సిగ్గు ఉందా అసలు మీరు ఏ పార్టీ అని అడిగితే చెప్పే దమ్ము మీకుందా అంటూ ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.