Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ పేరు కూడా ఒకటి. తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు పల్లవి ప్రశాంత్. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎక్కువగా ట్రోలింగ్స్ విషయంలోనే వార్తల్లో నడుస్తూ వస్తున్నాడు. బిగ్బాస్ హౌస్ కి వెళ్లక ముందు వరకు ఉన్న పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయాడు అంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కాస్త రాయలు బిడ్డగా మారిపోయాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఇలా ఉండే తాజాగా పల్లవి ప్రశాంత్ చేసిన పనికి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో మండిపడుతూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. తాజాగా బిగ్ బాస్ తెలుగు ఫేమ్ సోనియా ఆకుల పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. తన ప్రియుడు యష్ వీరగోనితో కలిసి ఆమె ఏడడుగులు వేసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన సోనియా వివాహానికి పలువురు బుల్లితెర ప్రముఖులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా హాజరయ్యారు. నూతన వధూవరులను మనసారా ఆశీర్వదించారు. సోనియా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే రిసెప్షన్ కి కూడా చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. అలా పల్లవి ప్రశాంత్ కూడా హాజరయ్యాడు. ఎప్పటిలాగే ఓవరాక్షన్ చేస్తూ హంగామాను చూపించాడు. రిసెప్షన్ వేడుకకు బౌన్సర్లతో అటెండ్ కావడంతో ఏకీపారేస్తున్నారు నెటిజన్స్.
ప్రశాంత్ చుట్టూ ముగ్గురు బౌన్సర్లు పెళ్లికి వచ్చిన అతిథులను పక్కకు పంపిస్తూ ముందుకు సాగారు. ఇక సోనియా దంపతులను కలిసిన పల్లవి ప్రశాంత్ కొత్త జంటతో కలిసి సరదాగా ఫొటోలు దిగారు. అనంతరం అక్కడే ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ పలకరించాడు. విందు కూడా స్వీకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు పల్లవి ప్రశాంత్. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఒక రేంజ్ లో మండిపడుతున్నారు. రోజు రోజుకి వీడి బిల్డప్ చూడలేకపోతున్నాం రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా ఓవర్ అయ్యింది బ్రో అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.