Allu Arjun: అభిమానులకు విజ్ఞప్తి చేసిన అల్లు అర్జున్.. ఇకపై అలా చేస్తే చర్యలు తీసుకోబడతాయి అంటూ!

Allu Arjun: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన రోజు రోజుకి ముదురుతూనే ఉంది. ఇప్పట్లో ఈ ఘటన సద్దుమణిగేలా కనిపించడం లేదు. దానికి తోడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ కూడా మరింత సంచలనంగా మారాయి. ఇది కాస్త టాలీవుడ్ ఇండస్ట్రీకి షాకింగ్ మారింది. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి నా తప్పులేదు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ మాట్లాడటం పై పలువురు కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ విషయంపై అల్లు అర్జున్ అభిమానులు స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అలాగే తెలంగాణ సీఎం రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే సైబర్ పోలీసులు సోషల్ మీడియాలో సీఎంపై వ్యాఖ్యలు చేసిన పలువురిపై కేసులు నమోదు చేశారు. దీంతో తాజాగా అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కి ఒక విజ్ఞప్తి చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్ తన ట్విట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు. నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడి, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగెటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని నా ఫ్యాన్స్ కు సూచిస్తున్నాను.

 

సోషల్ మీడియాలోనూ, బయట కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు బన్నీ. దీంతో తాజాగా బన్నీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మరి ఇప్పటికైనా అభిమానులు అల్లు అర్జున్ మాట విని నెగిటివ్ గా కామెంట్స్ చేయడం మానుకుంటారేమో చూడాలి మరి. అయితే అల్లు అర్జున్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తూ మీరు చెప్పినట్టే నడుచుకుంటాము అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.. మనం చేసే నెగిటివ్ కామెంట్స్ వల్ల మన హీరోకి తప్పు పేరు, కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి అన్న చెప్పినట్టు వినాలి అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.