Prashanth Neel: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన చిత్రం సలార్ పార్ట్ వన్ సీజన్ ఫైర్. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటించిన విషయం తెలిసిందే. గత ఏడాది అనగా 2023 డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్. కానీ ఈ సినిమా విషయంలో తాను సంతోషంగా లేను అని తెలిపారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ఆసక్తికర వాఖ్యలు చేసారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సలార్ ఫస్ట్ పార్ట్ కోసం తాను ఎంతో కష్టపడ్డాను. అయితే వచ్చిన ఫలితంతో తాను సంతోషంగా లేను. ఎక్కడో కేజీఎఫ్ 2 ఛాయలు కనిపించాయి. కానీ ఇక పై మాత్రం అలా జరగదు. సలార్ 2 చిత్రాన్ని ఖచ్చితంగా నా కెరీర్ లో బెస్ట్ సినిమాగా తీస్తాను అని చెప్పుకొచ్చారు. ప్రేక్షకుల ఊహలకు కూడా ఈ చిత్రం అందదు. జీవితంలో కొన్ని విషయాలపై ఎంతో స్పష్టంగా ఉన్నాను. అందులో సలార్ 2 ఒకటి అని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ప్రశాంత్ నీల్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.
అయితే సలార్ పార్ట్2: శౌర్యంగ పర్వం సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా రావాలంటే చాలా సమయమే పట్టేటట్లు ఉంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో మూవీ చేయనున్నారు. మరోవైపు ప్రభాస్ సైతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఏంటో చూడాలి మరి. డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా అరడజన్ కు పైగా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.