కమల్‌హాసన్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న ప్రాంఛైజీ ప్రాజెక్ట్ భారతీయుడు. శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ ప్రాంఛైజీలో ఇప్పటికే ఇండియన్ కూడా వచ్చిందని తెలిసిందే. ఈ ఏడాది జులై 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. వాయిదాల మీద వాయిదాలు పడి విడుదలైన సీక్వెల్ నిర్మాతలకు నష్టాలనే మిగిల్చడంతో ఇక మూడో పార్ట్ ఇండియన్ 3ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుందంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు రౌండప్ చేస్తున్నాయి.
ఇండియన్ 2 అలాంటి నెగెటివ్ రివ్యూస్ వస్తాయని అస్సలు ఊహించలేదు. సరేనంటూ ముందుకెళ్లాను. నేను నా వర్క్‌ను నమ్ముతా. అదేంటో గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 సినిమాలే చెబుతాయి. ఈ రెండు సినిమాలు తప్పకుండా థియేటర్లలో ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశాడు.
అంతేకాదు ఇండియన్ 3 థియేటర్లలో విడుదల కానుందని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో కమల్ హాసన్ అభిమానులు ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నారు. తాజా టాక్ ప్రకారం గేమ్ ఛేంజర్ విడుదలైన తర్వాత ఇండియన్ 3 ప్రమోషన్స్ కూడా షురూ చేయబోతుందట శంకర్ టీం. అంతేకాదు ట్రైలర్ కూడా త్వరలోనే థియేటర్లలో సందడి చేయబోతుందని ఇన్‌సైడ్ టాక్. సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసేలా ట్రైలర్ ఉండబోతుందట. ఇంకేంటి మరి తక్కువ టైంలోనే శంకర్ అభిమానుల కోసం రెండు సినిమాలు రాబోతున్నాయన్న మాట.