Shanmukh Jaswanth: అందరూ నన్ను వదిలేశారు..రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్..షణ్ముఖ్ జస్వంత్ ఎమోషనల్ కామెంట్స్!

Shanmukh Jaswanh: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ యూట్యూబర్ నటుడు షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిలిమ్స్,వెబ్ సిరీస్ లలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు జశ్వంత్. సోషల్ మీడియా ద్వారా భారీగా క్రేజ్ ని తెచ్చుకున్న షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక్కడివరకు బాగానే ఉన్నా ఆ తర్వాత జరిగిన సంఘటనలు షణ్ముఖ్ జస్వంత్ లైఫ్ ని చాలా వరకు మార్చేసాయి. అప్పటివరకు అతన్ని మెచ్చుకున్న అభిమానులే మండిపడ్డారు చీదరించుకున్నారు కూడా. తన ప్రియురాలు దీప్తి సునైనా తో బ్రేకప్ అవ్వడం, ఒక యాక్సిడెంట్ కేసు, గంజాయి తాగాడు అంటూ ఆరోపణలు, వాళ్ళ అన్నయ్యకు సంబంధించి ఇలా వరుసగా వివాదాల్లో నిలిచాడు. వీటన్నిటి నుంచి కోలుకోవడానికి షణ్ముఖ్ జస్వంత్ కి చాలా సమయం పట్టింది.

ఇలా చాలా గ్యాప్ తర్వాత లీలా వివాదం అనే ఓటిటి సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు షణ్ముఖ్. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఈవెంట్ లో మాట్లాడుతూ స్టేజి మీద లైవ్ లో ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ మాట్లాడుతూ.. కాలేజీ చదువు కోసం ఎక్కడో దూరంగా బెంగుళూరులో అమృత యూనివర్సిటీలో వేశారు. కానీ నాకు యాక్టింగ్ మీద పిచ్చి. దాంతో మా నాన్నకు నా లెఫ్ట్ బ్రెయిన్ కొంచెం హెవీ అయింది నేను చదవలేకపోతున్నాను, నాకు స్కాన్ చేయించండి, హాస్పిటల్ దగ్గరకు తీసుకెళ్లండి అని అడిగాను. దాంతో అప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేశాను నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉంది అందుకే ఇలా చెప్పాను మా ఇంట్లో వాళ్లకు చెప్పండి అంటే అప్పుడు డాక్టర్స్ తనకి చాలా ప్రెజర్ ఉంది తనను ఇంటికి తీసుకెళ్లిపొండి అని చెప్పారు.

అప్పుడు మళ్ళీ వైజాగ్ తీసుకొచ్చారు. అదే సమయంలో ఫస్ట్ లవ్ బ్రేకప్ అవ్వడం, యాక్టింగ్ ఛాన్సులు రాకపోవడంతో కొంచెం డిప్రెస్ ఫీల్ అయి సూసైడ్ అటెంప్ట్ చేశాను అని తెలిపాడు. తర్వాత ఫేమ్ వచ్చాక నేను ఎదుర్కున్న పరిస్థితులను గుర్తుచేసుకుంటూ నేను ఏం చేసానో, మీరు ఏం విన్నారో అదేమీ నిజం కాదు. అయింది ఒక కథ అయితే చూపించింది ఇంకో కథ. నేను తప్పు చేయలేదు అని చెప్పట్లేదు కానీ నేను ఒక్కడినే తప్పు చేశాను అన్నట్టు చూపించారు. ఒకదాని తర్వాత ఒకటి రావడంతో, నా చుట్టూ ఉన్న నా వాళ్లే నన్ను వదిలేయడంతో నేను డిప్రెషన్ లో ఉన్నాను. అప్పుడు చెయ్యి కోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశాను. నా ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అయ్యారు. నేను హనుమాన్ మీద ఒట్టేసాను నా ఫ్యామిలీని పైకి తీసుకొచ్చేది నేనే అని తెలిపారు షన్ను. ఈ సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.