Game Changer: తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే ఇదివరకు ఏ భారతీయ సినిమాకు నిర్వహించిన విధంగా అమెరికాలోని డల్లాస్‌లో గేమ్ ఛేంజర్ గ్లోబల్ ఈవెంట్ పేరుతో ప్రీ రిలీజ్ వేడుక జరిపిన విషయం తెలిసిందే.
అయితే ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘ఈవెంట్ చూస్తుంటే, నేను అమెరికాకు వచ్చినట్లు లేదు. తిరిగి ఇండియాకు వెళ్లినట్లు ఉంది. మంచి సినిమా అందిస్తే మీరు బాగా ఆదరిస్తారు. సరైన సినిమాలు తీయకపోతే అంతే స్థాయిలో విమర్శిస్తూ తిరస్కరిస్తారు. మీరెప్పుడూ అలాగే ఉండండి. కానీ నేను హామీ ఇస్తున్నాను. గేమ్ ఛేంజర్ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. శంకర్ గారి ప్రతి అభిమానికి ఇదొక బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. ఈ సంక్రాంతికి మా సినిమా లేకపోతే, కల్యాణ్ బాబాయ్ ని బలవంత పెట్టి అయినా ఆయన సినిమా రిలీజ్ అయ్యేలా చేసేవాడిని.
అసలు గేమ్ ఛేంజర్ డిసెంబరులో రావాలి. సంక్రాంతి డేట్ ఇచ్చిన చిరంజీవి గారికి, యూవీ ప్రొడక్షన్స్ వాళ్లకు ధన్యవాదాలు చెబుతున్నాను. మామూలుగా అన్ని విషయాల్లో దిల్ రాజు గారు మార్కులు కొట్టేస్తారు. కానీ తమన్ కూడా ఎక్కడా తగ్గలేదు. మనవాడు కూడా మార్కులు కొట్టేశాడు. మీకు ఎన్నవేణమో.. అన్ని ఇరుక్కింగా..అంటూ తమిళ్ లో మాట్లాడి రామ్‌చరణ్ నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా రోజులు గడిచి కొద్దీ ఈ సినిమాపై ఉన్న అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.