హిందూ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ వాస్తు శాస్త్రం పట్ల ప్రజలు ఎంతో విశ్వాసంగా ఉంటున్నారు. అందువల్ల గృహ నిర్మాణం, మొక్కలు పెంచటం,వ్యాపార స్థలం, వస్తువుల అమరికలు ఏ పని చేసినా కూడా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు నియమాలు విరుద్ధంగా పనులు చేయటం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అంతే కాకుండా ఇంట్లో వాస్తు దోషం వల్ల కూడా అనేక సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలకు వాస్తు దోషాలు కూడా కారణం కావచ్చు.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం ఎన్నో రకాల చిట్కాలను, పరిహారాలు వాస్తు శాస్త్ర నిపుణులు వెల్లడించారు. వెండి, చందనం చాలా సుబప్రదమైనవిగా పండితులు చెబుతున్నారు. గంధంను పూజ చేసే సమయంలో ఉపయోగిస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజలో సూర్యుడి అనుగ్రహం పొందాలి అంటే ఎర్ర చందనం ఉపయోగించాలి. అలాగే శుక్రుడు అనుగ్రహం కావాలంటే పసుపు చందనం, అంగారకుడు అనుగ్రహం కావాలంటే తెల్ల చందనం అవసరం. వీటి వల్ల మీకు జీవితంలో ఆనందం, శ్రేయస్సు, డబ్బు కలుగుతాయి.
ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్నవారు శుక్లపక్షం, శుక్రవారం రోజు మీ దగ్గర ఒక చిన్న వెండి ముక్కను ఉంచుకుంటే ఆర్ధిక ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది. అలగే వెండి ముక్కే కాకుండా వెండి ఉంగరం ధరించినా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.అలాగే శుక్రవారం రోజు వెండి పాత్రలో కలిపిన కుంకుమ తిలకం నుదుటి మీద పెట్టుకుంటే సుఖ సంతోషాలు, అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు, శుక్రుడిని వెండి సంతృప్తి పరుస్తుంది. ఈ వెండి ఆభరణాలు ధరించటం వల్ల మానసిక దృఢత్వం కలిగి మనసు కూడా ఆనందంగా ఉంటుంది.