రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ఎప్పుడు ఎదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం విజయ్ డేటింగ్ లైఫ్ గురించి అనేక వార్తలు ప్రచారమవుతున్న నేపథ్యంలో ఆయన మరోసారి క్ల్యారిటీ ఇచ్చాడు. తన పర్సనల్ విషయాలు గురించి వెల్లడించేందుకు సరైన టైమ్ చూసుకొనే వాస్తవాలు మాట్లాడుతా అన్నారు.
ఇంకా ఏం చెప్పారంటే.. రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ‘‘నేను ప్రజల ముందున్న వ్యక్తినే. నాకు సంబంధించిన విషయాలు అందరికి తెలుసుకోవాలనే ఆసక్తి సహజమే. కానీ, నా జీవితంలో ఓ ప్రత్యేక సమయం వచ్చినప్పుడు మాత్రమే వాటిని పంచుకుంటాను పబ్లిక్ ఫిగర్‌గా ఉండటం వల్ల చాలా వార్తలు వస్తాయి. వాటిని నేను సాధారణంగానే స్వీకరిస్తాను. అవి నా దృష్టిలో కేవలం వార్తలుగానే ఉంటాయి. అపారమైన ప్రేమ ఉంటే, దాని వెంట బాధ కూడా తప్పదు. ప్రేమించడం అంటే బాధను కూడా పంచుకోవడం. తగిన సందర్భంలో, సరైన కారణంతోనే విషయాలను పంచుకుంటా’’ అని ఆయన క్లారిటీ ఇచ్చేశాడు.
ప్రస్తుతం విజయ్.. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, రవి కిరణ్ కోలా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ మూడు సినిమాలు చేయనున్నాడు. ఇక 14 కథ విషయానికొస్తే.. రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటీకే రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం ఉంది. దాని మీద ‘ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్’ అని రాసి ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా పేర్కొన్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.