టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ముక్కుసూటి మాటకారి తనం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఉన్న విషయాన్ని ముక్కుసూటిగా…నిక్కచ్చిగా…
సీటు ఊడిపోతుందోనా? ప‌్రత్యర్ధులు టార్గెట్ చేస్తారనో? ఆయనకు భయముండదు. ప్లేస్ ఏదైనా..పార్టీ ఏదైనా..సందర్భం ఏదైనా నోటికి పని చెప్పాలని డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అన్నట్లే ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే! అది పొగడ్తైనా…విమర్శైనా.. ఇది జేసీ వ్యవహార శైలి. మరి ఇలాంటి డేరింగ్ నేతకి మహానాడు లాంటి చోట మైక్ ఇస్తే ఎలా ఉంటుంది? దుమ్ముదు లిపేయరు? చంద్రబాబు పుత్రవాత్సల్యం చిరిగిపోదు? లోకేష్ కళ్లెర్ర జేయడు? అందుకే జేసీని ఈ మహానాడుకి దూరం పెట్టారు. ఒకవేళ ఆయన మహానాడులో స్పందిస్తే ఎలా ఉంటుందనేది కొంత మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రకరకాల పోస్టుల ద్వారా తెలిపారు.
ఏమయ్యా లోకేష్ బాబు, ఏవండి చంద్రబాబు ఇదెక్కడి రాజకీయం. అబ్బే నేను మునుపెన్నడు చూడలేదు.బహిరంగంగానే నిరాహార దీక్ష చేస్తే నమ్మే పరిస్థితులు లేని ఈరోజుల్లో ఇంట్లో దీక్షలంటే ఎవరు పట్టించుకుంటారయ్యా? అని మొదలు పెట్టేవారుట. 175 సీట్లకు 23 ఎందుకొచ్చాయి. అందులో ఎవరి పాత్ర ఎంత అని చర్చించి, తప్పులు సరిదిద్దుకునే పనులు మానేసి..మా వాడి మీద పడ్డారేంటయ్యా! మొత్తం మా వాడు పబ్లిసిటీ కోసమే మహానాడు పెట్టినట్లున్నారనేవారుట. మహానాడులో జగన్ సర్కార్ ని విమర్శించడమే మహానాడు ఎజెండాగా సాగిన సంగతి తెలిసిందే. ఒకవేళ టీడీపీ బాధ్యతలు లోకేష్ కి అప్పగించాలనే తీర్మానం గనుక చేసుంటే! చంద్రబాబు 70 ఏళ్లు దాటినంత మాత్రాన ఏం కాదు. అయినా ఈ వయసులో అదేం నిర్ణమయ్యా. చినబాబు నెత్తిమీద అప్పుడే అన్ని బాధ్యతలు పెట్టి నువ్వు ఎంజాయ్ చేద్దామనా? మనం బ్రతికుండగా అంత రిస్క్ వద్దులేవయ్యా అనేవారుట. చినబాబు చిన్నపొల్లోడు..అమాయక చక్రవర్తి…రాజు పాలన సైనికుల వశం చేసుకుంటారనేవారుట జేసీ స్టైల్లో.