Mental Health: ఈ ఆధునిక కాలంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం , మారుతున్న ఆహారపు అలవాట్లు , పెరుగుతున్న పని ఒత్తిడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. సంపాదనలో పడి సమయానికి ఆహారం తినక , సమయానికి నిద్ర పోక లేనిపోని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే వీటన్నింటి వల్ల శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. పని ఒత్తిడి వల్ల శారీరకంగా అలసిపోతే విశ్రాంతి తీసుకోవచ్చు.. కానీ కానీ ఈ పని ఒత్తిడి వల్ల మానసికంగా అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోలేము. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం చాలా అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు . ఈ చిట్కాలను పాటించడంవల్ల మీ మెంటల్ టెన్షన్ తగ్గించవచ్చు.
పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇలా ఏ ఇతర సమస్యల టెన్షన్ వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి మొట్టమొదటి ప్రయత్నం వ్యాయామం. ప్రతిరోజు వ్యాయామం చేయడంవల్ల మెదడు చురుగ్గా పని చేసి ఒత్తిడిని తగ్గించవచ్చు. వాకింగ్ , రన్నింగ్ , సైక్లింగ్ , పిల్లలతో సమయం గడపటం , శరీరాన్ని కదిలించే చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల మైండ్ డ్రైవర్ అయ్యి.. శరీరంలో ఎండోర్ఫిన్స్ విడుదలయి పాజిటివ్ ఫీలింగ్స్ కలిగేలా చేస్తుంది. ప్రతి రోజు వ్యాయామం చేయటం వల్ల శరీరంలో కదలికలు కలిగి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
మనం తీసుకునే ఆహారం మీద మన మానసిక ఒత్తిడి ఆధారపడి ఉంటుంది. బ్యాలెన్స్డ్ డైట్ పాటించడంవల్ల మెంటల్ టెన్షన్ తగ్గుతుంది . సమయానుసారంగా పౌష్టిక ఆహారం తీసుకోవడం , శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఉండే ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఎనర్జీ పెరిగి మానసిక వత్తిడి నుండి విముక్తి పొందవచ్చు. ఎప్పటికప్పుడు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవటం వల్ల మెంటల్ టెన్షన్ తగ్గించవచ్చు.
మానసిక ఒత్తిడి అనేది మనిషి జీవితంలో ఉన్న ఆరోగ్య సమస్యలలో ఒకటి . మనం తీసుకొని ఆహారం మీద ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.. అలాగే నిద్రపోయే సమయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు 7-8 నిద్ర చాలా అవసరం. పని వత్తిడి వల్ల ఎప్పుడు తింటున్నారో , ఎప్పుడు నిద్రపోతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి తయారయింది. యంత్రాల్లా పనిచేసి విశ్రాంతి తీసుకోకపోవటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. శరీరానికి కావలసిన విశ్రాంతి తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేసి పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. అందువల్ల ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే రోజుకు 7 నుండి 8 గంటలు నిద్రపోవటం ఆరోగ్యంగా , మానసికంగా ఎంతో మేలు చేస్తుంది.