ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం, త్వరలో దివ్యాంగులకు (Differently-abled) కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటన చేశారు.
ఈ నిర్ణయం ద్వారా దాదాపు 2 లక్షల మందికి పైగా దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరపై 50 శాతం రాయితీ పొందుతున్నారు. ఇకపై పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో వీరికి పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించనున్నారు.
Nadendla Manohar: వైసీపీ హయాంలో రైతులకు అన్యాయం.. కూటమి వచ్చాకే భరోసా: మంత్రి నాదెండ్ల ఫైర్
Sajjala Ramakrishna Reddy: 16న గవర్నర్‌కు కోటి సంతకాలు.. లక్ష్యం మించి స్పందన: సజ్జల
ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం సిటీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అమలవుతుండగా, భవిష్యత్తులో ఈ కేటగిరీ బస్సుల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ పథకం అమలుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం, లబ్ధిదారుల సంఖ్య తదితర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
రాష్ట్రంలో దాదాపు 7.68 లక్షల మంది దివ్యాంగుల పెన్షన్లు పొందుతుండగా, వీరిలో సుమారు 2 లక్షల మంది ప్రస్తుతం ఆర్టీసీ రాయితీని వినియోగించుకుంటున్నారు. తాజా నిర్ణయంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.

