ఆ పాత్రలో నటించినందుకు గర్వంగా ఉంది… సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ పోస్ట్?

సహజ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి మలయాళీ అమ్మాయి అయిన సాయి పల్లవి మన తెలుగింటి అమ్మాయిలా కలిసిపోయింది. సాయి పల్లవి మాట్లాడే తెలుగు వింటే ఎవరైనా ఈమె తెలంగాణ అమ్మాయి అని అనుకుంటారు. ఇటీవల సాయి పల్లవి వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో నటించింది. ఈ సినిమాలో సాయి పల్లవి రానాకి జోడిగా వెన్నెల పాత్రలో నటించింది. యదార్థ సంఘటనల ఆధారంగా సరళ అనే ఒక మహిళ జీవిత కథ ఆధారంగా వేణు ఈ సినిమా రూపొందించారు.

ఇటీవల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. విడుదలైన మొదటి రోజూ నుండి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఇంతకాలం థియేటర్లలో సందడి చేసిన ఈ విరాటపర్వం సినిమా జులై 1వ తేదీ నుండి ప్రముఖ ఓటీటి సంస్ధ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించిన సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఒక ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో షూటింగ్ కి సంబంధించిన కొన్ని స్టిల్స్ పోస్ట్ చేసి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. “విరాట పర్వం సినిమాలో చేసిన వెన్నెల పాత్ర నాకెప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటి. ఈ పాత్రలో నటించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది..అంటూ చెప్పుకొచ్చింది. ఈరోజు(జులై 1) నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతోంది. మీరందరూ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను’ అంటూ రాసి క్యాప్షన్ పెట్టింది. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం ‘గార్గి’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ ఈ సినిమా మీద అంచనాలు పెంచేసింది.