Eggs: డయాబెటిక్ పేషెంట్స్ కి గుడ్డు మంచిదేనా… నిపుణులు ఏమంటున్నారంటే?

Eggs:ఆధునిక కాలంలో జీవన శైలిలో అనేక మార్పులు సంభవించాయి. ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో మొదటిది మధుమేహం సమస్య. ప్రపంచంలో కొన్ని మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యాధికి గురైన వారిలో రక్తం లోని చెక్కెర స్థాయి ఎక్కువ అవడమే కాకుండా, శరీరంలోని ఇతర అవయవాల మీద ప్రభావం చూపిస్తుంది. డయాబెటిస్ సమస్య ఉన్న వారికి చిన్న గాయం అయిన సరే అది పెద్ద పుండులాగా మారి ఆ శరీర భాగం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. మధుమేహ సమస్యలు ఉన్నవారు ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద వహించాలి.  వారు తినే ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేసుకోవాలి. ప్రీ డయాబెటిస్, టైప్ 2 డయాబెటీస్ లు శరీర భాగాలను ప్రభావితం చేసే గుండె, కాలేయం, కిడ్నీల పని తీరు మీద ప్రభావం చూపుతాయి.
డయాబెటిస్ బారిన పడినవారికి వారు తినే ప్రతి ఆహారం మీద అనుమానాలు ఉంటాయి. ఏది ఆరోగ్యానికి మంచిది ఏది కాదు అని ఆలోచించి తింటుంటారు. మధుమేహ వ్యాధి గ్రస్తులకు కోడి గుడ్లు తినడం మీద భిన్న అభిప్రాయాలు ఉంటాయి. కోడి గుడ్లు సహజంగానే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కోడిగుడ్లు తినవచ్చా ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి షుగర్ మీద ఎటువంటి ప్రభావం చూపుతాయని ఆలోచిస్తుంటారు.
అయితే ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం గుడ్లు ప్రోటీన్ ఫుడ్, గుడ్లు తినడం వల్ల డయాబెటిస్ పేషెంట్లకు ఎటువంటి ముప్పు వాటిల్లదు. ఒక పెద్ద గుడ్లు లో 6.25 గ్రాముల ప్రోటీన్, 4.74 గ్రాముల కొవ్వు, 0.35 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 72 కేలరీలు, ఫైబర్ ఉండదు. ఇంకా చాలా మంది గుడ్డులోపలి పచ్చసొనను తీసేసి తింటుంటారు, ఇందులో శరీరానికి కావాల్సిన మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది. శరీరం తనంతట తాను ఉత్పత్తి చేయనీ తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలను కూడా గుడ్డు తినడం వల్ల పొందవచ్చు. డయాబెటిక్ వ్యాధిగ్రస్థులలో గుడ్డు తినే వారి కంటే తినని వారికి తొందరగా గుండె సమస్యలు తలెత్తుతున్నాయి.
డయాబెటిక్ పేషెంట్స్ వారానికి 12 గుడ్లు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీకు ఎటువంటి సమస్యలు దరిచేరవు. గుడ్ల నుండి లభించే ప్రోటీన్ల లో ఎక్కువ భాగం అందులో ఉన్న పచ్చసొన నుండే వస్తుంది. పచ్చసొనలో విటమిన్ ఎ, ఇ, డి, కె, ఆరోగ్యవంతమైన కొవ్వులు ఉంటాయి. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ఎటువంటి అనుమానం లేకుండా వారానికి 12 సార్లు కోడిగుడ్డు ని తినడం వల్ల వారి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.