Jamun Fruit: శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలా… ఈ పండ్లు తప్పనిసరిగా తినాల్సిందే..!

Jamun Fruit: ఈ రోజుల్లో వాతావరణ కాలుష్యం ఆహార పద్ధతుల్లో మార్పులు చోటు చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ఆరోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. శరీరంలో రోగనిరోధకశక్తి తగ్గినప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అయితే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తినటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

నేరేడు పండ్లు కూడా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు,
ఆంథోసైనిన్స్‌, ఫ్లేవనాయిడ్స్‌, ఎక్కువగా ఉంటాయి. నేరేడు పండ్లలో ఉండే ఆంథోసైనిన్స్‌ శరీరంలో యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లుగా పనిచేసి దగ్గు,జలుబు, జ్వరం, తలనొప్పి, చర్మ వ్యాధులు, నుండి మనల్ని కాపాడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతి రోజూ నేరేడు పండ్లు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందించి శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తొలగిస్తుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.వర్షాకాలంలో లభించే ఈ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవి తినటం వల్ల వర్షాకాలంలో వ్యాప్తిచెందే సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

నేరేడు పండ్లలో ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్ లభించి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి. అంతేకాకుండా ఇవి చర్మ సంబంధిత వ్యాధులను నిర్మూలించడంలో కూడా ఉపయోగపడతాయి. నేరేడు పండ్లు తినటం వల్ల పళ్ళు,చిగుళ్ళు దృఢంగా తయారవుతాయి. ముఖ్యంగా మధుమేహ సమస్యతో బాధపడేవారు ఈ పండ్లు తినటం వారి సమస్య అదుపు చేయవచ్చు.