Director Srinivas Manne: ‘ఈషా’ అందర్ని భయపెడుతుంది… అలరిస్తుంది: దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె

Director Srinivas Manne: ప్రముఖ కథానాయిక జెనీలియా ప్రధాన పాత్రలో రూపొందిన ‘కథ’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె, కొంత విరామం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈషా’. ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఈ హారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబరు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ఈసందర్బంగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె శుక్రవారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.

కథ చిత్రం తరువాత ఇంత విరామం తీసుకోవడానికి రీజన్ ఏమిటి?

కథ చిత్రానికి నాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ చిత్రానికి ఉత్తమనటనకు జెనీలియాకు నంది అవార్డు కూడా వచ్చింది. కథ సినిమాకు మంచి అప్లాజ్‌వచ్చింది. కమర్షియల్‌గా పెద్దగా ఆడకపోయినా మంచి ప్రశంసలు వచ్చాయి.అనుకోకుండా నా వ్యక్తిగత కారణాల వల్ల దర్శకత్వానికి గ్యాప్‌ వచ్చింది. దామోదర్‌ ప్రసాద్‌ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన ఇచ్చిన సపోర్ట్‌తో ఈ సినిమా చేశాను.

ఇంత గ్యాప్‌ వచ్చింది కదా? ప్రస్తుతం తెలుగు సినిమా ధోరణి మారిపోయింది. మిమ్ములను మీరు అప్‌డేట్‌ చేసుకున్నారా?

నాకు సినిమా అనేది డ్రీమ్‌.. నేను ఎప్పుడూ అప్‌డేట్‌లోనే ఉంటాను. ఈ గ్యాప్‌లో కథలు సిద్దం చేసుకున్నాను.నేను కొరియన్, హాలీవుడ్‌సినిమాలు చూస్తుండేవాడ్ని. ఇప్పుడు సినిమా టెక్నికల్‌ గాకూడా చాలా మార్పులోచ్చాయి. లైటింగ్‌,సౌండ్‌ అన్నింట్లో అప్‌డేట్‌ అయ్యయి. స్టోరీ స్ట్రాంగ్‌గా ఉంటే టెక్నికల్‌గా అటు ఇటు ఉన్న సినిమా సక్సెస్‌ అవుతుంది. కానీ టెక్నికాలిటి అనేది కూడా సినిమా చాలా ముఖ్యం. ఇక అందరి లైఫ్‌లో భగవంతుడు ఏమీ జరగాలోముందే రాస్తాడు. అక్కడకి మనం వెళతాం. రిజల్డ్‌ కూడా ఫిక్స్‌ కానీ మనకు తెలియదు. మనం వెళ్లేప్రాసెస్‌అంతే అది నేను నమ్ముతున్నా

ఇప్పటి వరకు వచ్చిన హారర్‌ థ్రిల్లర్స్‌తో పోలిస్తే ఈ సినిమాలో ఉన్న కొత్తదనం ఏమిటి?

హారర్‌తో పాటు మన జీవితాల్లో ఉన్న చావులు పుట్టుకలు, అండర్‌ కరెంట్‌లో దైవత్వం, సృష్టి చేసే పనులు ఇలా అన్ని అంశాలు ఉంటాయి. సృష్టి అన్నింటిని బ్యాలెన్స్‌ చేస్తుంది. ఈ చిత్రంలో స్ట్రాంగ్‌గా కంటెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో అన్ని అంశాలను టచ్‌చేశాం. టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండే సినిమా ఇది. మేకప్‌, కాస్ట్యూమ్‌, లైటింగ్, సౌండ్‌ డిజైనింగ్‌ అన్నింట్లో కేర్‌తీసుకున్నాం.

ఈ సినిమా చూసి అందరూ భయపడతారు అంటున్నారు ఎందుకని

సినిమాలో చాలా షాకింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. వాంటెడ్‌గాఉండదు సినిమాచూసి భయపడతారు అంతే. హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు కూడా ఈ సినిమా చూడకూడదు. సెన్సారు వాళ్లుచూసి సినిమా చాలా భయంకరంగాఉంది. గుడ్‌ కంటెంట్‌ అన్నారు. కానీ ఈ కథను ఆ పాయింట్‌ను అలాగే డీల్‌చేయాలి.

ఈ సినిమా విజయంపై మీకున్న నమ్మకం ఏమిటి?

హారర్‌ సినిమాకుప్రత్యేక ఆడియన్స్‌ ఉంటారు. బన్నీ వాస్‌, వంశీ నందిపాటి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లే విధానంపై మాకు నమ్మకం ఉంది.

ఈ సినిమాలో మీరు చర్చించే కథాంశం ఏమిటి? ఈ సినిమా ద్వారా ఆత్మలు ఉన్నాయని చెబుతున్నారా?

ఫ్రెండ్‌షిప్‌, హ్యుమన్‌ ఎమోషన్స్‌, ఫిలాసఫీకల్‌గా ఉంటుంది. మూడ నమ్మకాలు,ఆత్మలు అన్నిఈ సినిమాలో చర్చిస్తున్నాం. మనకు జరగనంత వరకు ఏదైనా మూడ నమ్మకమే. మనకుజరిగితే అది నమ్మకంగామారుతుంది. అనే విషయం కూడా ఈసినిమాలో చూపిస్తున్నాం. రియల్‌గా ఎక్స్‌పీరియన్స్‌ చేసిన వాళ్లకు నమ్మకం. మనకు జరగలేదు కాబట్టిమూడ నమ్మకం. సృష్టిలో అన్ని ఉంటాయి. ఆత్మ అనేది లేకపోతే ఆ పదమే పుట్టదు కదా,మంచిచెడు ఉన్నట్లేఅది కూడా ఉంటుంది.

ఆత్మలు ఉన్నాయా? లేవా?

సినిమాలో చూస్తే తెలుస్తుంది. సినిమా చూసి అందరూ ఉలిక్కిపడి లేచే విధంగా ఉంటుంది.

చిన్న పిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉండాలా?

పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్‌ చేసే సినిమా ఇది. చిన్నపిల్లలు కొరియన్‌ హారర్‌ ఫిల్మ్‌చూస్తున్నారు. వాళ్లకు కూడా ఈ సినిమా ఎంతో నచ్చుతుది.

అఖిల్‌ నటించిన రాజు వెడ్స్‌ రాంబాయి సినిమా హిట్‌ అవ్వడం మీకు ఎంత వరకు ప్లస్‌ అవుతుంది?

రాజు వెడ్స్‌ రాంబాయి హిట్‌ అవ్వడం ఖచ్చితంగా మా సినిమాకు ప్లస్‌ అవుతుంది. అఖిల్‌తో పాటు అన్నిపాత్రలు ప్రేక్షకులనుఅలరించే విధంగా ఉంటాయి.

మీ తదుపరి చిత్రాలు ఎలా ఉండబోతున్నాయి?

నాకు అన్ని తరహా చిత్రాలు చేయాలని ఉంది. కథలుకూడా సిద్ధంగా ఉన్నాయి.

Public Reaction On Ys Jagan Comments On Chandrababu || Ap Public Talk || PawanKalyan || TeluguRajyam