సుధీర్ ఎవరో నాకు తెలియదు.. అతను మాత్రమే తెలుసు గీతాకృష్ణ కామెంట్స్ వైరల్?

కొన్ని రోజులుగా డైరెక్టర్ గీతా కృష్ణ పేరు తరచుగా వినపడుతోంది. అందుకు కారణం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన జబర్ధస్త్ గురించి రామోజీ రావు గురించి ఎన్నో ఆసక్తి విషయాలు వెల్లడించారు. అంతే కాకుండా జబర్ధస్త్ కమెడియన్లు గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. గీతా కృష్ణ ఒక ప్రముఖ టాలివుడ్ దర్శకుడు. ఈయన పలు సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన జబర్దస్త్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో నా దృష్టిలో ఒక బూతు షో. మగవాళ్ళు ఆడవాళ్ళులా వేషాలు కట్టి వెకిలి వేషాలు వేసే ఆ షో ని నేను చూడను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో అనసూయ గురించి మాట్లాడుతూ.. ఈ షో లో అనసూయ డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది. తన నటన కూడ చాలా బాగుంటుంది అంటూ ఆమెను పొగిడేశారు. ఇక ఈ క్రమంలో రామోజీ రావు గురించి మాట్లాడుతు.. ఒకప్పుడు ఈటీవి రేటింగ్స్ పడిపోవటంతో ఎలాగైనా ఈ ఛానల్ రేటింగ్స్ పెంచాలనే ఉద్దేశంతో రామోజీ రావు గారు జబర్ధస్త్ షో ప్రారంభించటానికి అంగీకరించారు.నిజానికి ఇలాంటి షో చేయటానికి ఆయనకి ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఈ క్రమంలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ గురించి అడగగా.. నేను జబర్ధస్త్ చూడను. వాళ్ళెవరో కుడా నాకు తెలియదు అంటూ సమధానం ఇచ్చాడు. జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులర్ అయిన ఈ ఇద్దరు తెలియదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. సుధీర్ ఎవరో తెలియదన్న గీతా కృష్ణ కి ప్రదీప్ మాత్రం బాగా తెలుసట. ప్రదీప్ గురించి తెలిసిన వారికి సుధీర్ గురించి తెలియకపోవటం ఎంటి? అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి జబర్ధస్త్ షో గురించి గీతా కృష్ణ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు వైరల్ అయ్యాయి.