Harish Rao: ఆరు గ్యారెంటీల విషయంలో రేవంత్ డకౌట్ అయ్యారు.. హరీష్ రావు హాట్ కామెంట్స్?

Harish Rao: బిఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఆరు గ్యారెంటీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తుర్కయంజాల్‌ లో జరిగిన పార్టీ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పరిపాలన పై సెటైర్లు వేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలపాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణ అని నెంబర్ వన్ స్థానంలో నిలిపారని హరీష్ రావు తెలిపారు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికే రాష్ట్రం మరో 15 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని హరీష్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలను ఇచ్చారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను బంద్ చేసి మూసీ దుకాణాన్ని తెరిచారని ఈయన ఎద్దేవా చేశారు.నిరుపేదల ఇళ్లను అన్యాయంగా కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని కామెంట్ చేశారు. పేదోళ్లతో పెట్టుకుని సీఎం రేవంత్ హిట్ వికెట్ చేసుకున్నారని తెలిపారు. 6 గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి డక్ ఔట్ అయ్యారని హరీష్ రావు తెలిపారు.

కెసిఆర్ తిరిగి మరోసారి ఫామ్ లోకి వస్తారు అంతిమ విజయం బీఆర్‌ఏస్ దేనని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలన పట్ల వ్యతిరేకత చూపుతున్నారు. ముఖ్యంగా మూసీ ప్రక్షాళన అంటూ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. మూసీ ప్రక్షాళన కోసం ఎంతోమంది కుటుంబాలు తమ సొంత ఇంటిని కోల్పోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి నిర్ణయాలు పట్ల ఎడాదిలోపే పూర్తిస్థాయిలో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు సైతం ఈ విషయాలను పదేపదే గుర్తు చేస్తూ అధికార ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడంలో తెలంగాణ సర్కార్ పూర్తిగా విఫలమైందని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.