Bandi Sanjay: లగచర్ల ఫార్మా కంపెనీ ఏర్పాటు పై తెలంగాణలో పెద్ద ఎత్తున విభాగం నెలకొంది ఇక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడం కోసం వికారాబాద్ జిల్లా కలెక్టర్లు ఇతర అధికారులు గ్రామానికి చేరుకోవడంతో ఒక్కసారిగా గ్రామస్తులు అధికారులపై దాడి చేశారు. ఇలా కలెక్టర్ పై దాడి చేయడంతో ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం పలువురు రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ అక్కడ భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇక లగచర్లలో ఏర్పాటు చేయబోయే ఫార్మా కంపెనీకి బిఆర్ఎస్ నేతలు పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు ఆ ఫార్మా కంపెనీ రేవంత్ రెడ్డి తన అల్లుడికి కానుకగా ఇవ్వబోతున్నారని కామెంట్లు చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు లగచర్ల ఘటన గురించి మాట్లాడుతూ కలెక్టర్లపై దాడి వెనుక కేటీఆర్ హస్తము ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు.
ఫార్మా కంపెనీకి తాము వ్యతిరేకం కాదని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే ఈ కంపెనీ ఏర్పాటులో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. రైతుల గురించి ఆలోచించకుండా దౌర్జన్యం చేయటానికి ఇదేమి రాచరిక పాలన కాదు. గతంలో బిఆర్ఎస్ కూడా ఇలాగే చేసింది. కలెక్టర్లపై దాడి చేయడం దారుణం ఈ దాడిని రైతులు చేయలేదని కేటీఆర్ ప్రమేయంతోనే దాడులు జరిగాయి అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది అయినప్పటికీ ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.
ఇలా కేటీఆర్ ప్రమేయంతోనే దాడి జరిగిందని చెబుతున్నప్పటికీ అరెస్టు చేయకపోవడంతోనే మీ చేతగానితనం ఏంటో బయట పడుతుందని తెలిపారు. కేటీఆర్ నక్క వినయం ప్రదర్శిస్తున్నారు ఈయన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడారని తెలిపారు. ఇటీవల కేటీఆర్ ధరణి భూములు , ఫార్ములా ఈ, ఫామ్ హౌస్ రేవ్ పార్టీ వంటి వరుస కేసులలో చిక్కుకున్న ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు ఒకటేనని తెలంగాణకు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులే అంటూ ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.