Devid Bennet Death: వైద్య శాస్త్రంలో విషాదం..పంది గుండె అమర్చిన వ్యక్తి మృతి..!

Devid Bennet Death: రెండు నెలల క్రితం వైద్య చరిత్రలో ఎప్పుడూ జరగని మహా అద్భుతం చేసి అమెరికా శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని తమ వైపు చూసేలా చేశారు. గుండె మార్పిడి సంబంధిత ఆపరేషన్ చేసారు. నిజానికి గుండె మార్పిడి చాలా రోజుల నుండే చేస్తున్నారు అయితే మొదటి సారిగా, ఒక పంది గుండెకు జన్యు మార్పులు చేసి ఒక మనిషికి అమర్చారు. అంతా బాగా జరుగుతోంది, ప్రపంచ వైద్య చరిత్రలో ఒక నవశకానికి ముందడుగు పడింది అనే సమయంలో…. గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృత్యు వాత పడ్డాడు.

అమెరికాలోని మేరీ ల్యాండ్ కు చెందిన డేవిడ్ బెన్నెట్ అనే 57 ఏళ్ల వ్యక్తికి ఏడాది జనవరి ఏడవ తారీఖున పంది గుండెను అమర్చారు. అమెరికాలోని మేరీలాండ్ ఆసుపత్రి వర్గాలు గుండె మార్పిడి సర్జరీని చేశారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన ఒక పంది గుండెను ఆయనకు విజయవంతంగా అమర్చారు. అయితే ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. సర్జరీ అనంతరం ఆయన కేవలం రెండు నెలలు మాత్రమే జీవించగలరు. కొన్ని రోజులుగా బెన్నెట్ ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో డాక్టర్లు శాయశక్తుల ఆయనను కాపాడడానికి శ్రమించారు. డాక్టర్ల ప్రయత్నాలు విఫలమవడంతో మంగళవారం బెన్నెట్ మృతి చెందినట్టు ఆయన కుమారుడు బెన్నెట్ జూనియర్ తెలిపారు.

1984 లోనూ ఇలాంటి ప్రయోగమే జరగగా అది కూడా విఫలం అయింది. 1984లో బబూన్ (కోతి జాతికి చెందినది) గుండెను ఒక నవజాత శిశువు కు అమర్చారు. అప్పట్లో సర్జరీ విజయవంతం అయిన ప్పటికీ ఆ శిశువు 20 రోజులు మాత్రమే జీవించగలిగింది. ఈసారి పంది గుండె మార్చుకున్న బెన్నెట్ రెండు నెలలు జీవించటం కొంత మెరుగైన ఫలితమే అవ్వగా…. ఇప్పుడు ఆయన కూడా రెండు నెలల్లో మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది.