రోడ్డు ప్రమాదంలో మరణించిన ఈ నందమూరి హీరో ఎవరో గుర్తుపట్టారా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వారసత్వాన్ని ఆయన కుమారులు అందుకొని ఇండస్ట్రీలో కొనసాగారు. అలాగే ఆయన మనవడిగా ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే అయితే నందమూరి కుటుంబానికి మరొక శాపం కూడా ఉందని తరచూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నందమూరి కుటుంబానికి చెందిన ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో మరణించారని వీరికి రోడ్డు ప్రమాదం శాపంగా మారిందని చెప్పవచ్చు.

ఇప్పటికే ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అలాగే హరికృష్ణ, హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇక రోడ్డుప్రమాదంలో బాలకృష్ణ ఎన్టీఆర్ తీవ్ర గాయాలు పాలైన పెద్ద ప్రమాదం నుంచి బతికి బయటపడ్డారు.వీరు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరితో పాటు ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమ రావు కుటుంబం సైతం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. త్రివిక్రమరావు పెద్ద కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి కుమారుడు, త్రివిక్రమరావు, ఆయన చిన్న కుమారుడు హరిన్ చక్రవర్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

కళ్యాణ్ చక్రవర్తి కూడా ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈయన తరహాలోనే హరీన్ చక్రవర్తి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మామాకోడ‌ళ్ల స‌వాల్’ (1986) మూవీలో ఓ విభిన్న పాత్ర‌లో న‌టించాడు. నిజానికి ఎన్టీఆర్ ‘మ‌నుషుల్లో దేవుడు’ (1974) సినిమాలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు.రేలంగి న‌ర‌సింహారావు డైరెక్ట్ చేసిన ‘పెళ్లికొడుకులొస్తున్నారు’ సినిమాలో యమధర్మ రాజు పాత్రలో నటించిన హారీన్ హీరోగా కొనసాగుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. లేకపోతే ఈయన కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకునే వారు.