Dancer Teena: కరోన మొదలైన సమయం నుండి సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా మృత్యువాత పడ్డారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవరో ఒకరు అనేక కారణాల చేత మరణిస్తున్నారు. ఇటీవల కూడా ఇండస్ట్రీలో ఒక విషాద సంఘటన చోటచేసుకుంది. బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో డాన్స్ షోలతో ఎంతో మంది డాన్సర్లు గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అటువంటి వారిలో డాన్సర్ టీనా కూడా ఒకరు. ఓంకార్ యాంకర్ గా వ్యవహరించిన ప్రముఖ డాన్స్ షో “ఆట” . ఆట మొదటి సీజన్లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన టీనా ఆ సీజన్ విన్నర్ గా గెలుపొందింది.
ఈ డాన్స్ షో లో టీనా తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఎంతో మంచి టాలెంట్ ఉన్న టీనా చాల కాలం క్రితం ఇండస్ట్రీకి దూరమయ్యింది. అయితే ఇటీవల ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయాన్ని ఆట సందీప్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. ” ఆట మొదటి సీజన్లో నా డాన్స్ పార్టనర్ గా ఉన్న టీనా ఇలా హఠాత్తుగా మృతి చెందిన విషయం నన్ను ఎంతగానో బాధిస్తోంది. టీనా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. తన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్న” అంటూ సందీప్ మాష్టర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు .
టీనా మృతి పట్ల పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలియచేశారు. అయితే ఆమె ఇలా మృతి చెందటానికి గల కారణాల గురించి ఇంకా పూర్తి సమాచారం అందలేదు. ఎంతో ప్రతిభ ఉన్న టీనా ఇలా అకస్మాత్తుగా మృతి చెందటంతో పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆట మొదటి సీజన్ విన్నర్ గా నిలిచిన టీనా .. ఆట నాల్గవ సీజన్ లో ఆ డాన్స్ షో కి జడ్జ్ గా కూడ వ్యవరించారు. ఆమె మృతితో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.