Crime News: ఈ మధ్యకాలంలో మత్తు పదార్థాలు, బంగారం, ఎర్ర చందనం వంటి వాటిని స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటనలు ఇటీవల కాలంలో చాలా జరిగాయి. ఇదిలా ఉండగా తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో గురువారంవనస్థలిపురంలోని నవత ట్రాన్స్పోర్ట్ లో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి.సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన వనస్థలిపురం చేరుకొని పరిశీలించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో ఉన్న నవత ట్రాన్స్పోర్ట్ లో సాధారణంగా చెక్ చేయగా కొన్ని బాక్స్ లు అనుమానాస్పదంగా కనిపించాయి. వెంటనే వాటిని తెరచి చూడగా అందులో పేర్లు పదార్థాలు ఉండటం తో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయగా పోలీసులు అక్కడికి చేరుకొని ఈ పేలుడు పదార్థాల గురించి విచారించారు.
చిలకలూరిపేట నుండి పూణే కి ఎనిమిది కార్టన్లలో పేలుడు పదార్థాలు పార్సిల్ చేయబడ్డాయి అని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మార్చి 15న ఈ పార్సిల్ హైదరాబాదుకు చేరుకోగా ట్రాన్స్పోర్ట్ సిబ్బంది సాధారణంగా తనిఖీలు చేయగా పేలుడు పదార్థాలు బయట పడ్డాయి. ఆ పేలుడు పదార్థాలను సినిమాలలో ఉపయోగించే బాంబులను పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో పోలీసులు మొత్తం 100 బాంబులను గుర్తించి కేసు నమోదు చేసుకున్నారు. పేలుడు పదార్థాలు ఎక్కడి నుండి కొనుగోలు చేశారు.. వాటి తరలింపునకు లైసెన్స్ ఉందా లేదా అన్న విషయాల గురించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
