Summer Health Tips: ఎండాకాలం వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Summer Health Tips: ఎండాకాలం వచ్చేసింది. ఉండలు మండిపోతున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అసలైన ఎండాకాలం మొదలు కాకముందే ఎందుకు అప్పుడే మండిపోతున్నాయి. అయితే ఎండాకాలం కూడా ఆరోగ్యపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర సీజన్ లతో పోల్చుకుంటే ఎండాకాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో చాలా ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. ఎండాకాలంలో శరీరానికి వేడి కలిగించే ఆహార పదార్థాలను దూరం పెట్టాలి. అలాగే వీలైనంత వరకూ శరీరానికి చలువ కలిగించే ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

ఎండాకాలంలో వడదెబ్బ కారణంగా తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక పోవడం, డీహైడ్రేషన్ ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది ఇటువంటి సమస్యల నుంచి మనం పొందాలి అంటే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం బాగా నీరు తాగాలి. అదేవిధంగా ఎండాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు కొవ్వుల తో కూడిన ఆహార పదార్థాలు శరీరంలో వేడిని మరింత పెంచుతాయి. వీటికి బదులుగా తాజా పండ్లు కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. నీటి స్థాయి ఎక్కువగా ఉన్న పళ్లను కూరగాయలను మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా వేసవిలో సూర్యరశ్మి ఎక్కువగా తగలడం వల్ల చర్మం కూడా ట్యానింగ్ కు గురయ్యే ప్రమాదం ఉంది.

అదేవిధంగా మొటిమలు, నల్లటి మచ్చలు, దద్దుర్లు లాంటివి చాలా ఇబ్బంది పెడతాయి. వేసవికాలంలో బయటకు వెళ్ళిన ప్రతి సారి కూడా ముఖం పై సన్ స్క్రీన్ అప్లై చేయడం టోపీలు ధరించడం లాంటివి చేయాలి. వేడి చెమట కారణంగా శరీరం తొందరగా డీహైడ్రేట్ అవుతుంది. ఫలితంగా తొందరగా అలసిపోతారు. కాబట్టి ఎండాకాలం ప్రతిరోజు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి. వీటితో పాటుగా సాధా నీరు, కొబ్బరి నీరు, నిమ్మకాయ దోసకాయ,ముక్కల తో కూడిన పానీయాలను బాగా తీసుకోవాలి. వేసవిలో భారీ త్వరగా డీహైడ్రేట్ అయిపోతుంది. కాబట్టి అలసటను తగ్గించుకోవడానికి వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి. బాగా నిద్ర పోవాలి. రాత్రి సమయంలో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. దీనివల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణమై జీర్ణక్రియ రేటును పెంచుతుంది. నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది.