Bollywood: సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ రంగంలో కూడా రాణిస్తూ ఉంటారు. సినిమాలలో వచ్చిన డబ్బులను బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ ఉంటారు. అలా ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్లు బిజినెస్ రంగంలో రాణిస్తూనే హీరో హీరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసిందే. మరి కొంతమంది ఇప్పుడిప్పుడే బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఒకరు. తన సోదరితో కలిసి ఒక వాటర్ బ్రాండ్ కంపెనీని స్థాపించింది.
అయితే ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా, ఇక్కడ అరలీటర్ వాటర్ బాటిల్ ఏకంగా రూ.150, అలాగే 750 ml వాటర్ బాటిల్ ధర రూ.200లకు లభిస్తోంది. మామూలుగా బాటిల్ బాటిల్ ద్వారా కేవలం 20 రూపాయలు మాత్రమే. మరి ఏంటి ఇంత రేట్లా? ఎవరు కొంటారు వీటిని? కేవలం సెలబ్రిటీలకు మాత్రమే అనుకుంటే పొరపాటు పడినట్టే. ఎందుకంటె ఈ వాటర్ లో ఆరోగ్యానికి ఉపకరించే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయట. ఈ హిమాలయ వాటర్ లో సహజసిద్ధమైన మినరల్స్, ఎలెక్టోలైట్స్ పుష్కలంగా ఉంటాయట. ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ పైనే ఆధారపడుతున్నారు.
పైగా వీటి కోసం భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అలాంటి వాటికి ప్రత్యామ్నాయంగా ఈ హిమాలయ వాటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చామంటోందీ స్టార్ హీరోయిన్. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భూమి పడ్నేకర్. భూమి తన సోదరి సమీక్షా పడ్నేకర్ తో కలిసి బ్యాక్‌బే ఆక్వా అనే వాటర్ బ్రాండ్ కంపెనీని స్థాపించింది. తాజాగా ఈ వాటర్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందీ అందాల తార. మాది ప్రీమియం వాటర్ బ్రాండ్ కంపెనీ. మూడు రకాల ఫ్లేవర్లలో లభ్యం అవుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్‌ను వాడలేదు. బాటిల్ క్యాప్ కూడా సులభంగా భూమిలో కలిసిపోయేదిగా తయారు చేశాము. పూర్తిగా పర్యావరణ స్పృహతో ఈ వాటర్ కంపెనీని స్టార్ట్ చేశాం అని తెలిపింది భూమి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మంచి ఆలోచన అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Bollywood: మంచి నీళ్లు అమ్ముతున్న హీరోయిన్.. అరలీటర్ వాటర్ బాటిల్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
