Health Tips: ఎండు ద్రాక్ష, నానబెట్టిన సెనగలు కలిపి తినటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

Health Tips:సాధారణంగా సెనగలు ఎండుద్రాక్ష విడివిడిగా తీసుకున్నా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఈ రెండిటినీ కలిపి తీసుకోవటం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి అవసరమైన ఐరన్, పొటాషియం, కాపర్, విటమిన్-బి6, మాంగనీస్, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం పోషకాలు ఏ రెండింటిలో పుష్కలంగా ఉంటాయి. ఎండు ద్రాక్ష, సెనగలు కలిపి తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎండు ద్రాక్ష, శనగలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల అనేక వ్యాధుల బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. ప్రతిరోజు ఉదయం ఎండు ద్రాక్ష, సెనగలు కలిపి ఇందులో ఉండే పీచు పదార్థం మెరుగుపరిచి మలబద్ధకం అజీర్తి వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు రాకుండా అరికడతాయి.

శనగలు ఎండుద్రాక్షలు ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెంచి రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి తినటం వల్ల కంటి చూపు కి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి.ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ రెండింటినీ కలిపి తినటం వల్ల క్యాన్సర్ సమస్యలు కూడా దరిచేరవు. అంతేగాకుండా ఖాళీ కడుపుతో ఈ రెండింటినీ తినటం వల్ల వీటిలో ఉండే ప్రోటీన్ రోజంతా శక్తివంతంగా ఉండేలా చేస్తాయి.