Health Tips: వేసవి మొదలైపోయింది. మార్చి నెల ఇంక ముగియకముందే భానుడు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాడు. ఫలితంగా చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు వెళ్ళిపోతుంది. దీనివల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి, డీహైడ్రేషన్ బారిన పడకుండా అనేకమంది దాహం వేయకపోయినా అదేపనిగా నీరు లేద పళ్లరసాలు ఎక్కువ మోతాదులో తాగుతుంటారు. దీనివలన శరీరంలోని నీటి స్థాయి పెరిగి డీహైడ్రేషన్ బారినపడకుండా ఉత్సాహంగా ఉంటారు అని అనేక మందిలో అపోహ ఉంది. అయితే ఆరోగ్య నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం వేసవిలో అదే పనిగా నీరు తాగడం శరీరానికి మేలు కంటే కీడే కలిగిస్తుందని తెలిపారు. ముఖ్యంగా కిడ్నీలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ఇండియన్ స్పైనల్ ఇంజ్యూరిస్ సెంటర్ హెడ్, కన్సల్టెంట్ అండ్ జనరల్ యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ నారంగ్ ఈ విషయం పై మాట్లాడుతూ… వేసవిలో అదేపనిగా పనిగా అధిక మొత్తంలో నీరు తాగడం శరీరానికి ముఖ్యంగా మూత్రపిండాలకు చాలా హాని కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ నీటిని బయటకు వదిలించుకోవడం లో మూత్రపిండాల సహాయ పడవు. ఫలితంగా సోడియం స్థాయిలు తగ్గిపోతాయి. దీని వల్ల రక్తంలో సోడియం స్థాయిని తగ్గిపోయి, ప్రాణాపాయ స్థితి వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. వేసవిలో ఎక్కువ నీటిని తీసుకోవటం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్ స్థాయి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీని వల్ల చికాకు, ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు ప్రాణ హాని కలిగే అవకాశం ఉంటుంది.
సోడియం ఓవర్ హైడ్రేషన్ వల్ల ఎలక్ట్రోలైట్ లు ఎక్కువగా ప్రభావితమవుతాయి. ఇది కణాల లోపల, బయట ద్రవాల స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. శరీరంలో సోడియం తగ్గి, నీటి స్థాయి అధికమైనప్పుడు ద్రవాలు కణాల లోకి ప్రవేశిస్తాయి. దీనివలన కణాలు ఉబ్బిపోయి కోమాలోకి వెళ్ళడం, మూర్ఛ రావడం, కొన్ని సందర్భాలలో చనిపోవడం జరుగుతుంది. ఓవర్ హైడ్రేషన్ వల్ల కణాలు ఉబ్బిపోయి తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన కలిగిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే హై బీపీ, హృదయ స్పందన రేటు తగ్గడం వంటి ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ఓవర్ హైడ్రేషన్ వలన కొంత మందిలో మూత్రాశయం పని తీరు దెబ్బతింటుంది. వృద్ధులు, కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి ఇది ప్రాణాంతకమే. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు రోజులో 2.5 నుండి 3 లీటర్లు నీటిని తాగడం శ్రేయస్కరమని డాక్టర్లు సూచిస్తున్నారు.