ఈ అలవాట్లు ఉంటే కిడ్నీలు త్వరగా పాడయ్యే అవకాశం.. జాగ్రత్త పడాల్సిందే!

మనలో చాలామంది ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. కొన్ని అలవాట్లు కలిగి ఉంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరితే మరికొన్ని అలవాట్ల వల్ల ఆరోగ్యానికి తీరని నష్టం కలుగుతుంది. మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి కాగా కొన్ని అలవాట్లను కలిగి ఉంటే కిడ్నీలు త్వరగా పాడయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కొంతమంది నీళ్లు తాగడం విషయంలో అశ్రద్ధ వహిస్తూ ఉంటారు.

మరీ దాహంగా అనిపిస్తే తప్ప నీళ్లు తాగడానికి ఆసక్తి చూపించరు అయితే ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడి కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మనలో కొంతమంది ఏ చిన్న సమస్య వచ్చినా టాబ్లెట్లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలా ప్రతి సమస్యకు టాబ్లెట్ వాడితే కూడా కిడ్నీలకు అపాయం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి.

మధ్యపానం, ధూమపానం అలవాట్లు సైతం కిడ్నీలకు నష్టం చేకూర్చుతాయి. చికెన్, మటన్ ఎక్కువగా తినేవాళ్లకు సైతం కిడ్నీలలో రాళ్లు ఏర్పడి కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి, షుగర్ ఉన్న డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి.

మూత్రంను ఎక్కువ సమయం పాటు ఆపుకున్నా కూడా కిడ్నీలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కిడ్నీలకు సంబంధించి ఏ లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిది. ఆరోగ్యానికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలకే ప్రమాదం కలుగుతుంది.