ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే బరువు తగ్గడం పక్కా.. ఏం చేయాలంటే?

ప్రస్తుత కాలంలో బరువు సంబంధిత సమస్యల వల్ల చాలామంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ కొన్ని పానీయాలను తీసుకోవడం ద్వారా సులువుగా బరువును నియంత్రణలో ఉంచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు ఉన్న నీటిని తాగడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. సగం నిమ్మకాయ, ఒక టీ స్పూన్ తేనె, కొన్ని నల్ల మిరియాలు వేసి కలుపుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.

శరీరంలోని విషపూరిత వ్యర్థాలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. నిమ్మకాయలోని ఆస్కార్బిక్ యాసిడ్ శరీరంలో ఉండే కఫాన్ని తగ్గించడంతో పాటు కొత్త కొవ్వు కణాలు పేరుకుపోవడానికి అనుమతించదు. సోంపు గింజలను కప్పు నీటిలో ఐదు నిమిషాలు ఉడకబెట్టి వడకట్టి రోజూ తాగాలి. ఈ విధంగా చేయడం ద్వారా శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోవడంతో పాటు త్వరగా ఆకలి వేసే ఛాన్స్ ఉండదు.

జీలకర్ర నీటిని తాగడం వల్ల ఊబకాయం వేగంగా తగ్గడంతో పాటు అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు గుండె సమస్యలు రాకుండా చేయడంలో తోడ్పడతాయి. ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. జీలకర్ర వాటర్ ఆర్థరైటిస్‌ సమస్యను తగ్గించడంతో పాటు శరీరంలోని టాక్సిన్లను సైతం తొలగిస్తుంది.

మెంతి నీరు తాగడం వల్ల స్థూలకాయం తగ్గడంతో పాటు షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో మెంతులు తోడ్పడతాయి. ఉసిరి రసం అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ కాగా కేలరీలను బర్న్ చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇది తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ సైతం పెరుగుతుందని చెప్పవచ్చు.