ఈ మధ్య కాలంలో చాలామంది పెరిగిన బరువును తగ్గించుకోవడానికి వేర్వేరు చికిత్సలపై ఆధారపడుతున్నారు. రాత్రి సమయంలో తినకుండా పడుకున్నా ఏమీ కాదని చాలామంది భావిస్తూ ఉంటారు. జీవనశైలిలో రాత్రి భోజనం ముఖ్యమైనది కాగా రోజూ మూడు పూటలా ఆహారం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. రాత్రి భోజనం మానేస్తే బరువు తగ్గవచ్చని కొంతమంది భావిస్తూ ఉంటారు.
అయితే రాత్రి సమయంలో భోజనం మానేయడం వల్ల శరీరానికి కలిగే నష్టాలు అన్నీఇన్నీ కావు. రాత్రి సమయంలో ఆహారం మానేస్తే శరీరంలో శక్తి స్థాయిలు తగ్గుతాయని చెప్పవచ్చు. ఉదయం లేవగానే చాలా నీరసంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. నీరసంగా ఉండటం వల్ల రోజువారీ కార్యకలాపాలపై తీవ్రస్థాయిలో ప్రభావం పడుతుంది. రాత్రి సమయంలో భోజనం మానేస్తే నిద్ర సంబంధిత సమస్యలు వస్తాయి.
మంచి నిద్రకు శరీరానికి శక్తి ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. . రాత్రి పూట ఆహారం, నిద్ర సరిగా లేకపోతే బద్దకం, నీరసం, చిరాకు వంటి సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది. రాత్రి సమయంలో భోజనం మానేస్తే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. జీర్ణ సమస్యల వల్ల శరీరంలో యాసిడ్ స్థాయి పెరగడంతో పాటు ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
రాత్రి భోజనాన్ని వీలైనంత వరకు స్కిప్ చేయకుండా ఉంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎంత బిజీగా ఉన్నా భోజనం విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. భోజనం స్కిప్ చేయడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని చెప్పడంలో సందేహాలు అవసరం లేదు.