మహిళలు నెలసరి సమస్యలతో బాధపడుతున్నారా.. ఇది మీకోసమే!

మనం రోజువారి వంటకాలలో మసాలా దినుసులు కచ్చితంగా తప్పనిసరిగా ఉపయోగిస్తుంటాం. మసాలా దినుసులు వల్ల ఆహారానికి మంచి రుచి సువాసన వస్తుంది. ఈ మసాలా దినుసులు ఆహారాన్ని రుచిగా మార్చడమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.అటువంటి మసాలా దినుసులలో దాల్చినచెక్క ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ప్రతిరోజు కొంత మోతాదులో మనం తినే ఆహార పదార్థాలలో దాల్చిన చెక్క చేర్చడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

స్వీట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వంటకంలో దాల్చిన చెక్కను జోడిస్తారు. దీనివల్ల వంటల యొక్క రుచి మరియు ఫ్లేవర్ మారిపోతుంది. దాల్చిన చెక్కలో న్యూట్రియన్స్, యాంటీఆక్సిడెంట్స్ తోపాటు పొటాషియం, జింక్, ఐరన్, క్యాల్షియం వంటివి ఉంటాయి. ఇవి శరీరం యొక్క బరువును తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి. అలాగే ఈ న్యూట్రియెంట్స్ అనేవి బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ వంటి వాటిని కంట్రోల్లో ఉంచుతాయి. రోజుకు రెండుసార్లు దాల్చిన చెక్క కలిపిన నీటిని తాగడం ద్వారా మంచి ఆరోగ్య ఫలితాలుంటాయని డాక్టర్లు సూచిస్తున్నారు.

దాల్చిన చెక్క నీటిని తాగడం వలన మీకు ఆకలి తీరినట్లు అనిపిస్తుంది. ఈ నీటికి టాక్సిన్స్ తొలగించగల సామర్త్యం ఉంటుంది కాబట్టి తరచూ కలిగే ఆకలి భావన తగ్గుతుంది .తద్వారా వెయిట్ లాస్ అవ్వడానికి దాల్చినచెక్క చాలా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క నీటిలో పోలిఫెనల్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. దాల్చిన చెక్కలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టరియల్ పెరామీటర్స్ ఉండటం వల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి.

దాల్చిన చెక్క మహిళలకి నెలసరి వల్ల వచ్చే విపరీతమైన నొప్పి నుండి త్వరిత ఉపశమనం కోసం ఈ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది. మహిళలో సంభవించే PCOS సమస్య వల్ల కలిగే ఇబ్బందులని తగ్గించడంలో సహాయడుతుంది. దాల్చిన చెక్క నీటిని ప్రతి రోజు తాగడం వల్ల కేన్సర్ సమస్యలకు కూడా స్వస్తి చెప్పవచ్చు.