Health Tips: ఈ సమస్యలతో బాధపడేవారు జామ పండ్లు ఎక్కువగా తింటున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే..!

Health Tips: సాధారణంగా జామపండును పేదవాడి ఆపిల్ గా పిలుస్తారు. అతి తక్కువ ధరలో లభించే జామపండులో ఆరోగ్యాన్ని సంరక్షించే ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. జామ పండు ఎంతో రుచిగా పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. జామ పండ్లు ప్రతి రోజు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడేవారికి జామ పండ్లు మరియు జామ చెట్టు ఆకులు వారి వ్యాది నియంత్రించడంలో ఎంతో ఉపయోగపడతాయి. సీజన్తో సంబంధం లేకుండా ప్రతి రోజు జామ పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడి మలబద్ధకం, అజీర్తి వంటి సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ప్రతిరోజు ఒక కప్పు జామ ఆకుల రసం తాగడం వల్ల బిపి, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అంతేకాకుండా మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి వంటి సమస్యలు నివారించటంలో కూడా ఈ జామ ఆకుల రసం ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న జామపండ్లు తినటం కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి మాత్రం చాలా ప్రమాదకరం. డయాబెటిస్తో బాధపడేవారు విధంగా జామ పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ జామ పండ్లు ఎక్కువగా తినటం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండాగ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు జామ పండ్లు ఎక్కువగా తినటం వల్ల వారి సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. జలుబు దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు మితంగా జామపండ్లను తీసుకోవాలి. లేదంటే గొంతులో కఫం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ప్రేగు సిండ్రోమ్ తో బాధపడేవారికి కూడా జామపండ్ల కు దూరంగా ఉండటం మంచిది. ఈ వ్యాధితో బాధపడే వారు పొరపాటున కూడా ఎక్కువగా జామ పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.