Dilwale Dulhania Le Jayenge: బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, కాజోల్ ఈరోజు లీసెస్టర్ స్క్వేర్‌లో కొత్త కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ దర్శకుడు ఆదిత్య చోప్ర తెరకెక్కించి దిల్‌వాలే దుల్హనియా లేజాయెంగే సినిమా భారతీయ సినిమాల్లోనే అత్యంత ఆదరణ పొందిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రాజ్, సిమ్రాన్ పాత్రలను పోషించినందుకు వారి పాత్రలకు దక్కిన గౌరవమది.
యష్ రాజ్ ఫిల్మ్స్‌లో 30 సంత్సరాలను పూర్తి చేసుకున్న ఈ బ్లాక్ బస్టర్ మూవీలోని రాజ్, సిమ్రాన్ పాత్రలకు సంబంధించిన ఐకానిక్ స్టిల్‌ను కాంస్య విగ్రహంగా రూపొందించారు. ఈ విగ్రహం వరల్డ్ వైడ్‌గా దక్షిణాసియాలో ఈ చిత్రానికి ఉన్న శాశ్వతమైన పాప్ కల్చర్‌ను ప్రభావితం చేసేలా సెలబ్రేట్ చేస్తోంది. లండన్ లీసెస్టర్‌లో విగ్రహ రూపంలో ఆవిష్కరింపబడ్డ తొలి ఇండియన్ సినిమా ఇదే. హ్యారీ పోటర్, మేరి పాపిన్స్ ప్యాడింగ్టన్, సింగింగ్ ఇన్ ది రెయిన్ వంటి చార్మిత్రాత్మక చిత్రాల్లోని ప్రముఖ పాత్రలతో పాటు బ్యాట్ మ్యాన్, వండర్ ఉమెన్ వంటి వాటి సరసన ఇప్పుడీ విగ్రహం ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
ప్రపంచ సినిమా చరిత్రలో అత్యంత ప్రసిద్ధ పాత్రలతో పాటు సీన్స్ ఇన్ ది స్క్వేర్ ట్రయిల్‌లో ఈ విగ్రహం తన ప్రత్యేక స్థానాన్ని పొందింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్‌స్టార్స్ షారూఖ్ ఖాన్‌తో పాటు కాజోల్, యష్ రాజ్ ఫిల్మ్స్ సీఈఓ అక్షయే విదానీ, హార్ట్ ఆఫ్ లండన్ బిజినెస్ అలయన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాస్ మోర్గన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా…
షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ ‘‘DDLJ సినిమా స్వచ్ఛమైన మనసుతో ఎంతగానో ప్రేమించి రూపొందించాం. ప్రేమ గురించి, అది ఎలా మనుషుల మధ్య ఉన్న అడ్డంకులను తొలగిస్తుందో, ప్రేమ ఎక్కువగా ఉంటే ప్రపంచం ఎంత బావుంటుందనే కథను దీంతో చెప్పాలనుకున్నాం. అందుకే DDLJ 30 ఏళ్లుగా ఇంతటి ప్రభావం చూపుతుందని భావిస్తున్నాను. వ్యక్తిగతంగా చూస్తే, DDLJ నా వ్యక్తిత్వంలోని ఒక భాగం. ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి ఇప్పటి వరకు నేను, కాజోల్ ప్రేక్షకుల నుంచి ప్రేమను ఇప్పటికీ పొందుతున్నాం. దాన్నెంతో గౌరవంగా భావిస్తున్నాం.
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజలకు, హార్ట్ ఆఫ్ లండన్ బిజినెస్ అలయన్స్‌కు DDLJను ఇలా సెలబ్రేట్ చేసి మాకు ఇలాంటి శాశ్వతమైన గౌరవాన్ని ఇచ్చినందుకు నేను వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతో గొప్పదైన సీన్స్ ఇన్ ది స్క్వేర్ ట్రైల్‌లో గౌరవం పొందిన తొలి భారతీయ సినిమా DDLJ కావడం చాలా ఎమోషనల్ మూమెంట్. మాకు మా పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చింది. ఈ సినిమాను ప్రపంచం ఇంతగా స్వీకరించిందే క్షనాలు మాకెంతో గర్వంగా ఉంటుంది. ఈ క్షణాన్ని మొత్తం నటీనటులు, సాంకేతిక వర్గం, నా స్నేహితుడు, దర్శకుడు అదిత్య చోప్రా..యష్ రాజ్ ఫిలిమ్స్ కుటుంబంతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది నేనెప్పటికీ మరచిపోలేని క్షణం” అన్నారు.
కాజోల్ మాట్లాడుతూ ‘‘“దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే రిలీజైన 30 ఏళ్ల తర్వాత కూడా ఇంత ప్రేమను పొందుతూ ఉండటం అద్భుతంగా ఉంది. లండన్‌లో విగ్రహం ఆవిష్కరించిన దృశ్యాన్ని చూసినప్పుడు.. ఆ చారిత్రాత్మక అనుభూతిని మళ్లీ పొందినట్లుగా అనిపించింది. ఇన్ని తరాలుగా అందరితోనూ ట్రావెల్ అవుతోన్న కథ. ఎంతో ప్రాముఖ్యత ఉన్న లీసెస్టర్ స్క్వేర్‌లో విగ్రహం ఏర్పాటు చేసిన ఈ క్షణం మా ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఈ గౌరవం పొందిన తొలి భారతీయ సినిమా కావడం, ప్రపంచంలోని DDLJ అభిమానుల హృదయాల్లో, మనసుల్లో ఎప్పటికీ నిలిచే అనుభూతి ఇది. మా సినిమాను ఇంతకాలం గుండెల్లో ఉంచుకున్న ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సంర్దర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అన్నారు.

DDLJ సినిమా రాజ్, సిమ్రన్ కథను చెబుతోంది. వారు ఇద్దరూ విదేశాల్లో నివసించే భారతీయులు. ప్రేమలో పడ్డ తర్వాత వారి కలిసే ప్రయాణం కింగ్స్ క్రాస్ స్టేషన్ ట్రయిన్‌లో మొదలవుతుంది.
లీసెస్టర్ స్క్వేర్‌లో DDLJ విగ్రహం ఉండడం కరెక్ట్. ఎందుకంటే ఇందులో రాజ్, సిమ్రన్ ఒకరినొకరు ఎదురుపడే సన్నివేశంలో ఇక్కడే సంభవిస్తుంది. అయితే సినిమాలో అప్పుడు ఒకరినొకరు గుర్తించరు. తర్వాత యూరోపియన్ ప్రయాణానికి బయలు దేరుతారు. ఆ సన్నివేశంలో రాజ్ వ్యూ సినిమా ముందు, సిమ్రన్ ఓడియెన్ లీసెస్టర్ స్క్కేవర్ పక్కన నడుస్తూ కనిపించటానికి మనకు స్పష్టంగా చూపించారు.
1995లో విడుదలైన DDLJ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక ఫీవర్‌ను సృష్టించింది. ప్రపంచంలోని దక్షిణాసియన్ కమ్యూనిటీ కోసం ఒక ముఖ్యమైన సాంస్కృతిక చిహ్నంగా నిలిచింది. అందుకనే ఈ విగ్రహాన్ని సినిమా 30వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ రోజుకి కూడా ఈ సినిమా భారతదేశంలో తన రికార్డు బ్రేక్ చేస్తూ ప్రదర్శింప బడుతోంది.
విడుదలయినప్పటి ఇప్పటి వరకు DDLJ హిందీ సినిమా చరిత్రలో అత్యంత ఎక్కువకాలం ప్రదర్శితమైన సినిమాగా చరిత్ర సృష్టించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా భారతదేశానికి చేసిన అధికారిక పర్యటనలో DDLJకు ప్రస్తావన ఇచ్చారు. UKలో కూడా ఈ సినిమాలోని వారసత్వం కొనసాగింది. ఈ ఏడాది ప్రారంభంలో మాంచెస్టర్‌లో కమ్ ఫాల్ ఇన్ లవ్ – ది DDLJ మ్యూజికల్ అనే కొత్త స్టేజ్ అడాప్టేషన్‌లో ఇది ప్రదర్శించబడింది.
యష్ రాజ్ ఫిల్మ్స్ సిఇఓ అక్షయె విధాని మాట్లాడుతూ ‘‘50 ఏళ్లకు పైగా హృదయాన్ని హత్తుకునే భారతీయ కథలను ప్రపంచానికి చెప్పడంలో నిమగ్నమైన ఒక భారతీయ స్టూడియోగా యష్ రాజ్ ఫిల్మ్ అందరి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. DDLJ విడుదలైన 30 ఏళ్లైన సందర్భంలో యునైటెడ్ కింగ్‌డమ్‌లోఇలాంటి గౌరవం లభించడం అందరూ గర్వించదగ్గ క్షణాలు. లీసెస్టర్ స్క్వేర్ వంటి చారిత్రాత్మక స్థలంలో శాశ్వతంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం మా సంస్థకు ఇదెంతో గర్వించే క్షణం. మేరీ పాపిన్స్, జీన్ కెల్లీ, హ్యారీ పోట్టర్ వంటి హాలీవుడ్ ఐకాన్లతోపాటు గుర్తింపు పొందడం, UK సహా ప్రపంచవ్యాప్తంగా DDLJ చూపిన సాంస్కృతిక ప్రభావాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఈ గౌరవం మా సృజనాత్మక ప్రయాణాన్ని మరింత ముందుకు నడిపిస్తుంది, అలాగే మా అద్భుతమైన దేశం నుంచి సృజన్మాత, స్ఫూర్తిదాయకమైన కథలతో ప్రపంచంలోని ప్రజలను అలరించేలా మా ప్రయాణం కొనసాగించాలని మేము ఆశిస్తున్నాం’’ అన్నారు.

