Ajwain Leaves Water: శీతాకాలం వచ్చిందంటే చాలు అనేక రకాల వ్యాధులను వెంట పెట్టుకొని వస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు శీతాకాలం లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. శీతాకాలంలో వచ్చే జలుబు దగ్గు జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుండి పిల్లల్ని కాపాడుకోవడం కోసం మన ఇంట్లో లభించే కొన్ని ఆహార పదార్థాలను ఉపయోగించి చిట్కాలు వల్ల ఈ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. సాధారణం ప్రతి ఇంట్లో పోపుల డబ్బాలో ఉండే మసాలా దినుసులు, పోపు గింజలు వల్ల కొన్ని వ్యాధులను నివారించవచ్చు. అలాగే వాము ఆకులో ఉండే ఔషధ గుణాలు మనం పిల్లల్ని పెద్దలు అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది. వాము ఆకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా పల్లెటూర్లలో ప్రతి ఇంటి ఆవరణలో ఒక వాము ఆకు చెట్టు ఉంటుంది. వాము ఆకు వాసన ఘాటుగా, రుచికి కారముగా ఉన్న కూడా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ,ఐరన్, ప్రోటీన్ వంటి ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి. వాము ఆకుల ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వినియోగిస్తారు. వామ్మో ఆకులలో ఉండే ఔషధ గుణాలు ,వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం.
శీతాకాలంలో అప్పుడప్పుడు వాము ఆకు మీద కొంచెం తేనె రాసి పిల్లలకు ఇవ్వటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి పిల్లల్ని రక్షించడానికి వాము ఆకు ని దోరగా వేయించి నీటిలో ఉడికించి కానీ నీటిని స్థాపించడం వలన ఇటువంటి వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది.
జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు ఉన్నప్పుడు 2 వాము ఆకులు నమిలి తినటం వల్ల తొందరగా ఉపశమనం లభిస్తుంది. వాము ఆకు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. చర్మం మీద దద్దుర్లు, ఏవైనా గాయాలు సెప్టిక్ అయినప్పుడు వాము ఆకు రసాన్ని గాయాలమీద రాస్తే గాయం తొందరగా తగ్గుతుంది.
తిన్న ఆహారం జీర్ణం కానప్పుడు వాము ఆకులు నమిలి తినటం వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. తలనొప్పితో బాధపడేవారు వాము ఆకు రసాన్ని తల నొప్పి ఉన్న ప్రదేశంలో రాయటం వల్ల తొందరగా ఉపశమనం లభిస్తుంది.