బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్, గ్లామరస్ దివా దీపికా పదుకోన్ కలిసి నటించిన సినిమా పఠాన్. ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేశారు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్. తన పఠాన్‌ని విడుదల చేసినందుకు రామ్‌చరణ్‌కి తనదైన ట్రేడ్ మార్క్ స్టైల్‌లో కృతజ్ఞతలు చెప్పారు షారుఖ్. “థాంక్యూ సో మచ్. నా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్.
మీ ట్రిపుల్ ఆర్ టీమ్ ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చినప్పుడు… దయచేసి నన్ను తాకనివ్వండి(మీ ట్రిపుల్ ఆర్ టీమ్ ఆస్కార్‌ని ఇంటికి తెచ్చినప్పుడు ఒక్కసారి నన్ను దానిని టచ్ చేయనివ్వండి) లవ్యూ“ అని ట్వీట్ చేశారు బాలీవుడ్ బాద్షా.
షారుఖ్‌ఖాన్ – రామ్‌చరణ్ ట్విట్టర్ చాట్‌ని చూసి నెటిజన్లు, ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
షారుఖ్ ట్వీట్ కి తనదైన శైలిలో వినమ్రంగా సమాధానమిచ్చారు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్. “తప్పకుండా ఎస్ ఆర్ కే సార్. ఈ అవార్డు ఇండియన్ సినిమాకు చెందింది“ అని రిప్లై ఇచ్చారు చరణ్.
అద్భుతమైన ప్రతిభ ఉన్న ఇలాంటి నటులు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్న తీరు ప్రశంసనీయం. ఇండియన్ సినిమాకు విశ్వవ్యాప్తంగా గౌరవం దక్కుతున్న ఈ తరుణంలో ఇలాంటి సుహృద్భావ వాతావరణం ఆహ్వానించదగ్గ పరిణామం.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రెండు కేటగిరీల్లో నామినేట్ అయింది ట్రిపుల్ ఆర్ సినిమా. ఈ వేడుకకు హాజరుకావడానికి రామ్‌చరణ్ లాస్ ఏంజెల్స్‌కి వెళ్లారు. అందరి కళ్లూ ఇప్పుడు ఈ అవార్డుల మీదే ఉన్నాయి.