Kiara: తెలుగు చిత్ర పరిశ్రమకు మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు నటి కియారా అద్వానీ. ఇలా ఈ సినిమాతో మంచి సక్సెస్ కావడంతో అనంతరం తెలుగులో రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈమె పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితం అయ్యారు.
ఇక ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న కియారా తిరిగి గేమ్ చేంజర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈమె బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా వరుస ప్రాజెక్టులకు కమిట్ అయిన కియారా ఇటీవల గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకున్నారు.
ఈమె త్వరలోనే తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన వరకు కొన్ని విషయాలను కూడా ఈమె అభిమానులతో పంచుకున్నారు. తనకు ఒక బేబీ సరిపోదని ఇద్దరు కావాలని తెలియజేశారు. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవడం ఎంతో అవసరం.
చాలామంది సెలబ్రిటీలు వారి అందంపై ఫోకస్ పెడుతూ పిల్లలను కూడా చాలా ఆలస్యంగా కంటూ ఉంటారు. అందం కోసం ఫుడ్ డైట్ మెయింటెన్ చేయటం వర్కౌట్ చేయడం వంటివి చేస్తుంటారు అయితే ప్రెగ్నెన్సీ విషయంలో ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండటం మంచిది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ఫుడ్ క్రేవింగ్స్ కూడా ఉంటాయి. కానీ కీయారా మాత్రం తనకు ఏది తినాలనిపిస్తే అన్నింటినీ తింటానని ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని తెలిపారు అలాగే వర్కౌట్స్ గురించి కూడా పెద్దగా పట్టించుకోనని ఈ ప్రెగ్నెన్సీ సమయంలో తాను డైట్, వర్కౌట్స్ కి పూర్తిగా దూరంగా ఉంటానని తెలిపారు. దీంతో ఈమె చేసిన ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.