తెలుగు నుంచి బాలీవుడ్ వరకూ రష్మిక మందన్నా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అనిమల్ 900 కోట్లు, పుష్ప 2 1800 కోట్లు, ఛావా 500+**కోట్లు వరుసగా భారీ విజయాలు అందుకోవడంతో ఆమె స్టార్ హీరొయిన్‌గా దూసుకెళ్తోంది. ప్రత్యేకంగా బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో సికందర్ అనే మాస్ ఎంటర్‌టైనర్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఇదే టైమ్‌లో ఆమెపై బడా నిర్మాతలు భారీ పెట్టుబడులు పెడుతున్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
యూవీ క్రియేషన్స్ ఇప్పటికే అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఘాటి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే బాటలో రష్మిక మందన్నాను ఓ పెద్ద ప్రాజెక్ట్‌లో తీసుకుని 70 నుంచి 100 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఇక్కడే మేజర్ డౌట్ వస్తోంది.. కేవలం రష్మికను నమ్ముకుని 100 కోట్లతో బిజినెస్ చేయగలరా అనే కామెంట్స్ వస్తున్నాయి.
ఇప్పటి వరకూ రష్మిక నటించిన అనిమల్, పుష్ప 2, ఛావా వంటి చిత్రాలు ఆమె స్టార్డమ్‌ను పెంచాయి. కానీ, ఆ సినిమాలు రష్మిక పేరు మీద కాదు. రణబీర్ కపూర్, అల్లు అర్జున్, విక్కీ కౌశల్ వంటి స్టార్స్ లీడ్‌లో ఉండటం వల్లే వసూళ్లు భారీ స్థాయిలో వచ్చాయి. అలాగే ఆ సినిమాల్లో రష్మిక చేసిన పాత్రలు కూడా అంతంత మాత్రమే అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇంకా ముఖ్యంగా నటన పరంగా చూస్తే, రష్మిక ఇప్పటివరకు సరైన పర్ఫార్మెన్స్‌తో ఔట్‌స్టాండింగ్ అనిపించుకున్నట్లు లేదు. ఆమెకు గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ బలంగా ఉన్నప్పటికీ, సహజంగా ప్రేక్షకుల గుండెల్లో నాటుకుపోయేలా నటన చూపించలేదనే వాదన కూడా ఉంది.
ఛావాలో ఆమె పాత్ర చూసిన వారందరూ ఆమెపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. అసలు కథలో ఆమె పాత్ర తక్కువ స్కోప్ కలిగి ఉందని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో మేకర్స్ రష్మిక క్రేజ్‌ను అంచనా వేస్తూ ఆమెకు 100 కోట్ల మూవీ ఇవ్వడమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ తరహా లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్‌తో స్టార్ హీరోల సినిమాల రేంజ్‌లో కలెక్షన్లు రావాలంటే కథలో భారీ బలమే ఉండాలి. అలాగే, తారాగణం, టెక్నికల్ టీం కూడా ఒక రేంజ్‌లో ఉండాలి. మరి రష్మిక సినిమా ఆ స్థాయికి వెళ్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సిన విషయం.