Sai Pallavi: సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తుంటారు పాత వాళ్ళు కనుమరుగవుతూ ఉంటారు. కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం అదే క్రేజ్ కంటిన్యూ చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు అలాంటి వారిలో సీనియర్ నటి నయనతార ఒకరు. నయనతార ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాల కాలం పూర్తి అయిన ఇప్పటికీ ఈమె స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.
సౌత్ సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటిగా పేరు పొందిన నయనతార ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇటీవల జవాన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హిట్ కొట్టారు.
ఇక నయనతార ఈ సినిమాలో నటించినందుకు ఏకంగా 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుందని సమాచారం. ఇక సౌత్ ఇండస్ట్రీలో కూడా నయనతారను మించి రెమ్యూనరేషన్ ఇప్పటి వరకు ఎవరు తీసుకోలేదు . అయితే రెమ్యూనరేషన్ విషయంలో నయనతారను సాయి పల్లవి వెనక్కి నెట్టిందని తెలుస్తుంది. సాయి పల్లవి కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే .ఈమె బాలీవుడ్ రామాయణం సినిమాలో నటిస్తున్నారు ఇందులో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటించగా సాయి పల్లవి సీతగా కనిపించబోతున్నారు.
ఇక కే జి ఎఫ్ సెన్సేషనల్ హీరో యష్ ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటించబోతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది అయితే ఈ సినిమాలో నటిస్తున్నందుకు సాయి పల్లవి తీసుకునే రెమ్యూనరేషన్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా కోసం సాయి పల్లవి ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం అయితే ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా సక్సెస్ అందుకున్న సాయి పల్లవికి సక్సెస్ రేట్ అధికంగా ఉన్న నేపథ్యంలోనే ఈ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది.